ChatGPT Plus free: ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న ఓపెన్‌ఏఐ సంస్థ ఇండయన్ టెక్ కమ్యూనిటీకి, రీసెర్చర్లకు ఒక అద్భుతమైన కానుకను అందించింది. ఏఐ ఆధారిత పరిశోధనలను.. మరింత వేగవంతం చేసే లక్ష్యంతో, భారతీయ పరిశోధకులకు ‘చాట్‌జిపిటి ప్లస్’ (ChatGPT Plus) సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం టెక్, విద్యా రంగాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా చాట్‌జిపిటి ప్లస్ సబ్‌స్క్రిప్షన్ నెల ఫీజు సుమారు $20 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1,700 నుంచి రూ. 1,800 వరకు) ఉంటుంది. అంటే ఏడాదికి.. సుమారు రూ. 20,000 పైనే ఖర్చవుతుంది. కానీ ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా రీసెర్చర్లు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండా జీపీటీ-4ఓ (GPT-4o) వంటి లేటెస్ట్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఉచితంగా పొందొచ్చు. మరింత ఫాస్ట్ రెస్పాన్స్‌లు,లేటెస్ట్ డేటా అనాలిసిస్, కోడింగ్ అసిస్టెన్స్, కస్టమ్ జీపీటీల సృష్టి వంటి ప్రీమియం ఫీచర్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయి.
ఓపెన్‌ఏఐ నిబంధనల ప్రకారం.. ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికీ లభించదు. దీనికి కొన్ని నిర్దిష్టమైన అర్హతలు ఉన్నాయి.
పరిశోధకులు & అకడమిక్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా సంబంధిత సైన్స్ విభాగాలలో యాక్టివ్‌గా రీసెర్చ్ చేస్తున్న భారతీయ పరిశోధకులకు ఇది వర్తిస్తుంది.
గుర్తింపు పొందిన సంస్థలు: దేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ లేదా ఏఐ ఇన్నోవేషన్ హబ్స్‌లో పని చేస్తున్నవారు లేదా స్టడీ చేస్తున్నవారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు.
ప్రాజెక్ట్ ప్రపోజల్: తమ పరిశోధనలో భాగంగా ఏఐని ఏ విధంగా ఉపయోగించాలనుకుంటున్నారో ప్రాథమిక వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: బ్లాక్ ఫ్రైడే సేల్ 2026..ఐఫోన్లు,ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు,ఎప్పటినుంచంటే?
ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే.. రీసెర్చర్లు కింది సాధారణ దశలను అనుసరించాలి.
అధికారిక వెబ్‌సైట్: ముందుగా ఓపెన్‌ఏఐ అధికారిక పోర్టల్ లేదా రీసెర్చ్ గ్రాంట్స్ పేజీలోకి లాగిన్ అవ్వండి.
అప్లికేషన్ ఫారమ్: మన పరిశోధకుల కోసం కేటాయించిన ప్రత్యేక అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయండి.
వివరాలు: తర్వాత మీ పర్సనల్ వివరాలతో పాటు, మీరు పని చేస్తున్న రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివరాలు, ప్రాజెక్ట్ వివరాలు సబ్మిట్ చేయండి.
వెరిఫికేషన్: ఓపెన్‌ఏఐ మీ వివరాలను పరిశీలించిన తర్వాత, మీ అకౌంట్‌కు ఒక ఏడాతి పాటు ఉచిత చాట్‌జిపిటి ప్లస్ యాక్సెస్‌ను యాక్టివేట్ చేస్తుంది.