Reshma Rathod : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నిలబెట్టుకోవడానికి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్ని ప్రయత్నాలు వర్క్ అవుట్ అవుతాయి. ఇంకొన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. కొంతమందికి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఎక్కడో కొద్దిగా అసంతృప్తి ఉంటుంది. అందువలన ఉన్నఫలంగా ఫీల్డ్ మారుస్తూ కొత్తదారులు వెతుక్కుంటారు.
రేష్మ రాథోడ్ స్టోరీ వింటే దాదాపు అలానే అనిపిస్తుంది. మామూలుగా మనం సినిమాలలో ట్విస్టులు చూస్తూ ఉంటాము. కానీ ఈమె రియల్ లైఫ్ ట్విస్ట్ సినిమాను మించి ఉంటుంది.
ఏకంగా సుప్రీంకోర్టు లాయర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేష్మ రాథోడ్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2012లో వెంకటేష్ హీరోగా బాడీగార్డ్ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి రూపొందించిన ‘ఈరోజుల్లో’ చిత్రంలో మెయిన్ లీడ్ గా చేసింది. 2017 తర్వాత మరో సినిమా చేయలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తుంది.
సినిమాల్లో రాణించకపోవడం వలన
మామూలుగా సినిమాల్లో రాణించకపోతే చాలామంది దిగులు చెందుతారు. కానీ కొంతమంది మాత్రమే తమలోని టాలెంట్ కు పదును పెట్టి కొత్తదారులు వెతుక్కుంటారు. ఇక రేష్మా రాథోడ్ కేవలం సినీ నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలుగా కూడా ప్రయత్నాలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యింది. మొత్తానికి ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్ గా బాధ్యతలు స్వీకరించడం అనేది సినిమా మాదిరి ట్విస్ట్.
Also Read: Vishwambhara : చిరంజీవి కంటే ముందే విశ్వంభర కంప్లీట్ కథని లీక్ చేసిన దర్శకుడు