Vishwambhara : బింబిసారా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు వశిష్ట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. కళ్యాణ్ రామ్ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ కూడా వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత వశిష్ట ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అనగానే అందరికీ కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ వశిష్ట మాత్రం డిఫరెంట్ గా ఆలోచించి మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక సోషియో ఫాంటసీ సినిమాను డిజైన్ చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
విశ్వంభర కంప్లీట్ కథ
జగదేకవీరుడు అతిలోకసుందరి కథను నేను సీక్వెల్ చేయలేదు. దానిని అటు ఇటు మార్చలేదు. దానికి అసలు సంబంధం లేదు. నాకు ఆ సినిమా అంటే ఇష్టం. నేను ఫాంటసీ అని అన్నాను కాబట్టి దానికి దీనికి కలిపేసారు. అంతేకానీ మా సినిమాకి, ఆ సినిమాకి అసలు సంబంధం లేదు. విశ్వంభర అనే సినిమాకి నాకు ఇన్స్పిరేషన్ కీలుగుఱ్ఱం, పాతాళబైరవి, జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ ఫాంటసీ సినిమాలు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే దాయడానికి ఏమీ లేదు. ఒక హీరో తన హీరోయిన్ ని వెతుక్కుని 14 లోకాలకు వెళ్లి, అక్కడి నుంచి తనను మళ్ళీ ఇక్కడికి ఎలా తెచ్చుకున్నాడు అనేదే కథ ఇంతే. ఈ పాయింట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి 14 లోకాలను కి వెళ్లే విధానాన్ని చూపించడంలో వశిష్ట ఏదో దాచే ఉంచాడు. ఖచ్చితంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఈ సినిమా విజువల్ ట్రీట్ అవ్వనుంది అని వశిష్ట మాటలతో అర్థం అవుతుంది.
అన్నింటినీ మించి
మొత్తం మనకున్నవి 14 లోకాలు. పైన ఏడు లోకాలు, కింద ఏడు లోకాలు. ఈ 14 లోకాలను రకరకాల దర్శకులు వాళ్లకు తెలిసిన విధంగా చూపించారు. కానీ నేను ఈ 14 లోకాలనే కవర్ చేసి కొంచెం పైకి వెళ్లాను. అంటే సత్యలోకం ఏదైతే ఉందో, బ్రహ్మదేవుడు ఉండే ఒక సత్య లోకం. దానిని నేను వాడుకున్నాను అదే విశ్వంభర. ఈ 14 లోకాలకి బేస్ అదే. ఈ సినిమాలో హీరో కూడా డైరెక్ట్ గా సత్యలోకానికి వెళ్లిపోతాడు. చిరంజీవి గారు ఇంతకుముందు అత్తకి యముడు అమ్మాయికి మొగుడు టైం లో యమలోకం కి వెళ్ళారు. తర్వాత చాలామంది హీరోలు స్వర్గానికి వెళ్లారు. అందుకని ఇవన్నీ కాకుండా వేరే లోకానికి వెళ్తున్నాను. అంటూ కంప్లీట్ డీటెయిల్స్ వశిష్ట చెప్పేశాడు.
Also Read: Vassishta: బింబిసారా దర్శకుడు కథ ఓకే చేసిన రజినీకాంత్, ప్రాజెక్టు జరగకపోవడానికి ఇదే కారణం