Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. భాగ్యనగర వాసులకు వరం లాంటిది. భాగ్యనగరంలో ట్రాపిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి కిలో మీటర్ దూరం ప్రయాణించాలంటే.. 20 నుంచి 30 నిమిషాల సమయం కూడా పడుతోంది. నగరంలో మెట్రో అందుబాటులో వచ్చాక ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఉప్పల్ నుంచి హైటిక్ సిటీ రావాలంటే మెట్రో ద్వారా అయితే 40 నుంచి 45 నిమిషాల్లో రావొచ్చు. అదే బస్సులో ప్రయాణిస్తే గంటన్నర నుంచి 2 గంటల సమయం కూడా పట్టొచ్చు. అది ట్రాఫిక్ పైన డిపెండై ఉంటుంది. దీంతో ఉద్యోగులు కాస్త టికెట్ ధర ఎక్కువగా ఉన్న మెట్రోలో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. నాలుగు నుంచి ఐదు నిమిషాలకొక మెట్రో ట్రైన్ ఉంటుంది. దీంతో మెట్రో బెటర్ ఆప్షన్ అనుకుంటున్నారు ప్రయాణికులు..
ప్రతిరోజు మెట్రో రైలు సేవలు సాఫీగా జరుగుతుంటాయి. కానీ.. తాజాగా నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లే మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రైళ్ల షెడ్యూళ్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్య వల్ల మెట్రో ట్రైన్లు లేటుగా నడవడంతో పాటు.. రాయదుర్గం స్టేషన్ లో అయితే మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి తోడు కరెక్ట్ సమయంలో నగరంలో భారీ వర్షం పడింది. దీంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికులు సంఖ్య ఎక్కువ కావడంతో స్టేషన్ లో గజిబిజి పరిస్థితి ఏర్పడింది. మెట్రో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.
మామూలుగా నాలుగు నుంచి ఐదు నిమిషాలకొకడి నడిచే మెట్రో రైళ్లు ఈ రోజు 15 నిమిషాలకు పైగా లేట్ అయ్యింది. రాయదుర్గం స్టేషన్ లో అయితే కాసేపు మెట్రో ట్రైన్ లే రాలేదు. దీంతో ప్రయాణికులు చాలా సమయం మెట్రో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అటు భారీ వర్షం పడడంతో.. రోడ్లపై నిలబడలేక.. మెట్రోలో ప్రయాణించేందుకు ఒక్కసారిగా జనాలు క్యూకట్టారు. కరెక్టు అదే సమయానికి ఉద్యోగులు ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. దీంతో మెట్రో స్టేషన్ లు రద్దీతో అల్లాడాయి.
ALSO READ: Brian Niccol: ఆఫీసుకు వెళ్లేందుకు 1600 కిమీల విమాన ప్రయాణం.. చివరికి పరిష్కారం దొరికింది
టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు క్యూకట్టారు. చాలా సేపు ప్రయాణకులు క్యూలైన్ లో నిలుచున్నారు. మెట్రో లేట్ అవ్వడంతో గంట సేపు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మెట్రో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు వర్షం, మరో వైపు ట్రైన్ ఆలస్యం కావడంతో ప్రయాణికుల నానా అవస్థలు పడ్డారు. సాంకేతిక సమస్యను త్వరగా పరిష్కరించాలని జనాలు అధికారులను అడిగారు. మరో సారి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు.
ALSO READ: Vijayawada News: ఎస్ఐ అరాచకం.. అదనపు కట్నం కోసం ఏకంగా భార్యను..?