BigTV English

Bollywood: సినీ నటి కారు ధ్వంసం.. పోలీసులు పట్టించుకోలేదంటూ నటి ఆవేదన!

Bollywood: సినీ నటి కారు ధ్వంసం.. పోలీసులు పట్టించుకోలేదంటూ నటి ఆవేదన!

Bollywood:సినీ నటీనటులకు అప్పుడప్పుడు ఎదురయ్యే పరిణామాలు అటు సినీ సెలబ్రిటీలనే కాదు ఇటు అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ నటి కారు ధ్వంసం చేయడంతో అసురక్షితంగా భావించాను అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


నటి కారును ధ్వంసం చేసిన నిరసనకారులు..

అసలు విషయంలోకి వెళితే.. ‘ది కపిల్ శర్మ షో’ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుమోనా చక్రవర్తి (Sumona Chakravarti) కారుపై కొంతమంది నిరసనకారులు దాడి చేశారు. దక్షిణ ముంబైలో మనోజ్ జరంజే.. మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం సోమవారం పెద్ద ఎత్తున జరిగింది. అటుగా వెళుతున్న నటి సుమోనా చక్రవర్తి కారుపై మరాఠా రిజర్వేషన్ నిరసనకారులు దాడి చేయడంతో ఆ సంఘటన ఆమెకు అసురక్షిత భావన కలిగించింది అని, ఇంత పెద్ద సంఘటన అక్కడ జరుగుతుంటే ఆదుకోవడానికి పోలీసులు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది నటి..


సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నటి..

సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు సుమోనా చక్రవర్తి కొలాబా నుండి ఫోర్ట్ కు ప్రయాణిస్తుండగా మరాఠా ఆందోళనకారులు ఆమె కారును చుట్టుముట్టారట. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా వ్యక్తం చేసింది. అయితే పోస్ట్ పెట్టిన క్షణంలోనే అది వైరల్ అవ్వడంతో వెంటనే ఆమె దానిని డిలీట్ చేసింది కూడా.. మరి డిలీట్ చేసిన ఆ పోస్టులో ఆమె ఏం షేర్ చేసింది అనే విషయానికి వస్తే.. “ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను కొలాబా నుండి ఫోర్ట్ కి కారులో వెళ్తున్నాను. అకస్మాత్తుగా నా కారును ఒక గుంపు అడ్డుకుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి, అతని స్నేహితులు నా కిటికీలను కొడుతూ జై మహారాష్ట్ర అంటూ అరుస్తున్నారు. నేను కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా మళ్లీ మళ్లీ నా కారును వెంబడించారు.

దక్షిణ ముంబైలో మొదటిసారి అలాంటి భావన కలిగింది…

ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు నా కారుపై దాడి చేశారు.. దక్షిణ బొంబాయిలో పట్టపగలు నా కారులో నేను మాత్రమే ఉన్నాను. ఆ అరుపులు దాడి కారణంగా అసురక్షితంగా భావించాను. ముఖ్యంగా నిరసనకారులు.. రోడ్లపై అరటి తొక్కలు, ప్లాస్టిక్ సీసాలు, మురికితో రహదారులను ముంచేశారు. అక్కడే తినడం, నిద్రపోవడం, స్నానం చేయడం, మూత్ర విసర్జన, మలమూత్రాలు చేయడం, వంట చేయడం, వీడియో కాలింగ్, రీల్స్ ఇలా నిరసన పేరుతో ముంబైను అలా మార్చడం పౌర జ్ఞానాన్ని పూర్తిగా అపహాస్యం చేయడమే. నేను నా పుట్టుకతోనే ఇక్కడి నుంచే జీవితాన్ని కొనసాగించాను. కానీ ఎప్పుడూ కూడా అసురక్షితంగా భావించలేదు. ముఖ్యంగా దక్షిణ ముంబైలో మొదటి సారి సురక్షితంగా లేను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ALSO READ:HBD Pawan Kalyan: అయిష్టంతో ఇండస్ట్రీలోకి.. ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్!

Related News

shraddha das: తీన్మార్ స్టెప్పులతో పబ్లిక్ లో అదరగొట్టేసిన శ్రద్ధాదాస్.. వీడియో వైరల్!

Sundarakanda Collections : సుందరకాండ మూవీకి 5.5 కోట్ల నష్టం… పాపం నారా రోహిత్ !

OG Movie : ఓజీకి జీరో బజ్.. పవన్ మళ్లీ వీరమల్లు గెటప్ వేయ్యాలేమో?

OG Movie: ఓజీ.. ఆ చిత్రాల కాపీనా.. హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే ?

Samantha: అందులోనే నెగ్గాలని చూస్తున్న సామ్.. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?

Nandamuri Family: మళ్లీ మొదలైన వార్.. హరికృష్ణ జయంతితో బయటపడ్డ గొడవలు!

Big Stories

×