BigTV English

OTT Movie : చచ్చేదాకా పొట్టుపొట్టు కొట్టుకునే చావే లేని అమ్మాయిలు… ఓటీటీలో దుమ్మురేపుతున్న లేడీ యాక్షన్ ఎంటర్టైనర్

OTT Movie : చచ్చేదాకా పొట్టుపొట్టు కొట్టుకునే చావే లేని అమ్మాయిలు… ఓటీటీలో దుమ్మురేపుతున్న లేడీ యాక్షన్ ఎంటర్టైనర్

OTT Movie : ఓటీటీలో ఒక యాక్షన్ మూవీ దుమ్ము దులుపుతోంది. మానవాళిని అంతంచేయాలనుకునే దుష్టులతో,  కొంతమంది సూపర్ హీరోస్ పోరాడుతారు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ మతిపోయేలా చేస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ సూపర్ హీరో యాక్షన్ మూవీ పేరు ‘ది ఓల్డ్ గార్డ్ 2’ (The old guard-2). 2025 లో విడుదలైన ఈ సినిమాకి విక్టోరియా మహోనీ దర్శకత్వం వహించారు. ఇది గ్రెగ్ రూకా రాసిన కామిక్ బుక్ సిరీస్ ‘ది ఓల్డ్ గార్డ్’ ఆధారంగా రూపొందింది. ఇది 2020లో విడుదలైన ‘ది ఓల్డ్ గార్డ్’ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఇందులో చార్లిజ్ థెరాన్ (ఆండీ), కికి లేన్ (నైల్), మాటియాస్ షోనార్ట్స్ (బుకర్), మార్వాన్ కెంజారీ (జో), లూకా మారినెల్లి (నికీ), వెరోనికా గో (క్విన్), చివెటెల్ ఎజియోఫర్ (కోప్లీ) వంటి నటులు నటించారు. ఇది 2025 జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 1 గంట 45 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈసినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

‘ది ఓల్డ్ గార్డ్ 2’ సిరీస్ మొదటి పార్ట్ ముగిసిన చోట నుండి మొదలవుతుంది.  సిథియా అలియాస్ ఆండీ, శతాబ్దాలుగా మానవాళిని కాపాడుతున్న అమర యోధులకు నాయకత్వం వహిస్తుంటుంది. ఆమె బృందంలో నైల్, జో, నిక్కీ, జేమ్స్ కోప్లీ అనే వీరులు ఉంటారు.  ఆండీ తన అమరత్వాన్ని కోల్పోయిన తర్వాత, సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇప్పుడు స్టోరీలోకి ఇద్దరు కొత్త శత్రువులు ప్రవేశిస్తారు. డిస్కార్డ్ మానవాళిపై కోపంతో ఉన్న ఒక యోధురాలు. అంతే గాక క్విన్ ఆండీ మాజీ సన్నిహితురాలు. ఆమె 500 సంవత్సరాల క్రితం ఇనుప కవచంలో బంధించబడి సముద్రంలో మునిగి, అనేక బాధలు పడి మానవాళిని అంతం చేసేందుకు వస్తుంది.

ఆండీపై పగతో, డిస్కార్డ్‌తో కలిసి మానవాళిని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో క్విన్ పనిచేస్తుంది. ఆండీ బృందం, టువా అనే మరో అమర యోధుడి సహాయంతో, ఈ కొత్త ముప్పును ఎదుర్కోవడానికి, అతనితో కలసి పని చేస్తుంది.  కథలో ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఏమిటంటే, నైల్ ఒక అమర యోధుడిని గాయపరిస్తే, ఆ యోధుడు తన అమరత్వాన్ని కోల్పోతాడని టువా నమ్ముతాడు. ఇది నైల్, ఆండీ మధ్య జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌లో ఆండీ అమరత్వం కోల్పోవడానికి కారణమని తెలుస్తుంది.

బుకర్ అనే వ్యక్తి మొదటి పార్ట్ లో అందరికీ ద్రోహం చేసి ఉంటాడు. తిరిగి మళ్ళీ ఈ బృందంలో చేరతాడు. కానీ నైల్‌తో ఒక స్పారింగ్ మ్యాచ్‌లో గాయపడి, అతను కూడా తన అమరత్వాన్ని కోల్పోతాడు. ఇక డిస్కార్డ్, క్విన్ కలసి లక్షలాది మందిని చంపగల బాంబులను సెట్ చేస్తారు. ఈ బాంబులను నిర్వీర్యం చేసే ప్రక్రియలో, బుకర్ తన అమరత్వాన్ని ఆండీకి వచ్చేలా చేస్తాడు. దీనివల్ల ఆండీ తిరిగి అమరత్వాన్ని పొందుతుంది. కానీ బుకర్ మరణిస్తాడు. చివరికి క్వీన్ ప్రపంచాన్ని అంతం చేస్తుందా ? ఆండీ క్వీన్ ను ఎలా ఎదుర్కుంటుంది. అనే  విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also  : ఒక్కడితోనే పని కానిచ్చే వదినా మరదళ్ళు… పెళ్లయ్యాక పాడు పనులు… మతి పోగొట్టే క్లైమాక్స్ ట్విస్టు

Related News

OTT Movie : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు

OTT Movie : భార్య కంటికి చిక్కే భర్త లవ్ లెటర్… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

Big Stories

×