Anushka Ghaati Movie: లాంగ్ గ్యాప్ తర్వాత స్వీటీ అనుష్క ఘాటీ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్దమైన ఈ చిత్రానికి వరుసగా రిలీజ్ కష్టాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకున్న ఘాటీ బయ్యర్లు కరువయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ సినిమాను కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదట. కొంటామని వచ్చిన వారు మూవీకి రేట్ తక్కువగా కోట్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.
ఘాటీ మూవీకి రిలీజ్ కష్టాలు
ఈ క్రమంలో ఓ స్టార్ హీరో తల్లి ఘాటీ రైట్స్ తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా శాండల్‌వుడ్ నటుడు. తెలుగు డైరెక్టర్ సినిమాను కన్నడ హీరో కొనడం విశేషం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్‌క ప్రధాన పాత్రలో ఘాటీ మూవీ తెరకెక్కింది. యాక్షన్, క్రైం డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అనుష్క ఇదివరకు ఎన్నడు కనిపించిన సరికొత్త పాత్ర పోషించింది. ఇందులో ఆమె విలేజ్ బ్యాక్‌డ్రామ్ మహిళగా మాస్ అవతార్‌లో కనిపించింది. ఇక ఈ సినిమా మొత్తం అడవుల్లో కొండల చూట్టూ నివసించే ఘాటీల చూట్టు తిరుగుతుంది.
వారి వ్యాపారాలకు బడా వ్యక్తులు, పోలీసులు అడ్డుపడటం.. దానికి ఘాటీ ఎలా ఎదుర్కొన్నార్నదే ఈ సినిమా కథని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. డైరెక్టర్ క్రిష్-అనుష్క కాంబోలో సినిమా అనగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక అనుష్క లుక్ పోస్టర్స్, టీజర్ మూవీపై మంచి బజ్ పెంచాయి. దీంతో ఘాటీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ మూవీ తరచూ వాయిదా పడుతుండటంతో సినిమాపై బయ్యర్లలో నమ్మకం సన్నగిల్లింది. దీనికి ఇటీవల విడుదలైన హరి హర వీరమల్లు, వార్ 2, కూలీ చిత్రాలు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రాలు దారుణంగా నిరాశ పరిచాయి. దీంతో అనుష్క ఘాటీ మూవీని కొనేందుకు బయ్యర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట.
ఆ హీరో చేతికి ఘాటీ రైట్స్
అయితే తక్కువ రేట్ అయితే కొంటామంటూ కండిషన్స్ పెడుతున్నారు. తెలుగులో ఈ సినిమా బిజినెస్ కష్టాలు ఎదురువుతున్న తరుణంలో కన్నడలో ఈ మూవీ రైట్స్‌ని రాక్ స్టార్ స్టార్ యష్ తల్లి పుష్ప తీసుకున్నారట. ఇందుకోసం ఆమె భారీగా డబ్బులు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇటీవల యష్ తల్లి పుష్ప తన భర్త అరుణ్ కుమార్‌తో కలిసి PA(Pushpa Arun Kumar) ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌లో తొలి చిత్రంగా కొత్తలవాడి అనే కన్నడ సినిమాను నిర్మించి రిలీజ్ చేశారు. ఇప్పుడు అనుష్క ఘాటీ చిత్రం కన్నడ రైట్స్ తీసుకుని విడుదల చేయబోతుండం విశేషం. విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు, వీటీవీ గణేష్, చైతన్యరావు వంటి తదితర నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈచిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రాజీవ్ రడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.