Sivakarthikeyan: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు శివ కార్తికేయన్(Shiva Karthikeyan) ఒకరు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన కెరియర్ మొదట్లో బుల్లితెర యాంకర్ గా కొనసాగుతుండేవారు. ఇలా పలు టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్ వ్యవహరిస్తూ అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. టీవీ యాంకర్ గా కొనసాగుతున్న శివ కార్తికేయ మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలను అందుకుంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈయన సినిమాలు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదల అవుతూ ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.
మురగదాస్ డైరెక్షన్లో శివ కార్తికేయన్..
ఇటీవల శివ కార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇకపోతే త్వరలో ఈయన మదరాశి (Madharaasi)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ఏఆర్ మురగదాస్ (ARMurugadoss) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మురగదాస్, శంకర్ తో సినిమా అంటే హేళన చేశారు..
ఇందులో భాగంగా నటుడు శివ కార్తికేయన్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. టీవీ యాంకర్ గా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు హీరోగా ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు ప్రేక్షకుల ఆదరణ, అభిమానాలే కారణమని తెలిపారు.తాను మాన్ కరాటే ఆడియో లాంచ్‌లో భాగంగా భవిష్యత్తులో ప్రముఖ దర్శకులు ఏఆర్ మురగదాస్, శంకర్(Shankar) వంటి దర్శకుల సినిమాలలో నటించాలని ఉందని మాట్లాడినప్పుడు చాలామంది నన్ను హేళన చేస్తూ విమర్శించారు. ఈరోజు నేను మదరాశి సినిమాని మురగదాస్ గారితో చేస్తున్నాను. ఇలా నేను అనుకున్న స్థాయిలో నిలబడ్డాను అంటే నన్ను ఇక్కడికి తీసుకు వచ్చిన నా అభిమానులే కారణమని, వారి మద్దతుకు ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
అంచనాలు పెంచిన ట్రైలర్…
ప్రస్తుతం శివ కార్తికేయన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో తప్పకుండా శంకర్ గారితో కూడా సినిమా చేసే అవకాశం వస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో సక్సెస్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. టాలెంటెడ్ డైరెక్టర్ మురగదాస్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇటీవల కాలంలో మురగదాస్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత శివ కార్తికేయన్ తో మదరాశి సినిమా ద్వారా రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కనుక హిట్ అయితే శివ కార్తికేయన్ స్టార్ హీరోల జాబితాలోకి, మురుగదాస్ మళ్ళీ పీక్ ఫార్మ్ లోకి వస్తారని చెప్పాలి.
Also Read: Actor Yash: డైరెక్టర్ గా మారిన యష్..ఇక థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!