E-Paper
Advertisement

RRR Re release: ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. వారణాసితో స్పెషల్ సర్‌ప్రైజ్!

RRR Re release: ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. వారణాసితో స్పెషల్ సర్‌ప్రైజ్!
Advertisement

RRR Re release: ప్రస్తుత కాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఏ రేంజ్ లో కొనసాగుతోందో .. అదే రీ రిలీజ్ చిత్రాల సమయంలో ఆ చిత్రాలకు సంబంధించిన డైరెక్టర్లు.. తమ కొత్త సినిమాలను ప్రమోట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగానే దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు వెండితెర పైనే కాకుండా అటు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది.ముఖ్యంగా ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో “నాటు నాటు” సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM keeravani)..ఆస్కార్ అవార్డు అందుకోగా.. ఈ పాట లిరిక్స్ అందించిన చంద్రబోస్ (Chandrabose) కూడా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు గడిచినా.. ఇప్పటికి దీని క్రేజ్ ఎక్కడా.. ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు.

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఆర్ఆర్ఆర్..

ఇదిలా ఉండగా.. అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ రీగల్.. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేసింది. మార్చి నెలలో ప్రతిరోజు ఒక ఆస్కార్ నామినేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించే సిరీస్ లో భాగంగా మార్చి 2వ తేదీన ఈ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఇక్కడ మరో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే.. ఈ రీ రిలీజ్ కేవలం సినిమా కోసం మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ స్పెషల్స్ స్క్రీనింగ్ లో వారణాసి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివీల్ వీడియోని కూడా ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఇక ఇది వారణాసి చిత్రాన్ని అటు అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది.

వారణాసితో స్పెషల్ సర్‌ప్రైజ్..

Advertisement

ఇకపోతే ఒకవైపు ఆస్కార్ గెలిచిన “నాటునాటు” పాటతో అలరించిన ఆర్ఆర్ఆర్ సినిమాను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రావడం ఒక ఎత్తు అయితే.. మరోవైపు వారణాసి ఫస్ట్ లుక్ వీడియోని అటాచ్ చేయడం మరో ఎత్తు అనే చెప్పాలి. ఏది ఏమైనా ఊహించని సర్ప్రైజ్ తో రాజమౌళి అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సినిమాపై హైప్ క్రియేట్ చేయబోతున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక మార్చి 2వ తేదీన జరిగే ఈ ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కి రాజమౌళి తన చిత్ర బృందంతో హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

ALSO READ:Jai Hanuman: అంజనాద్రిలో పట్టాలెక్కిన జై హనుమాన్.. డైరెక్టర్ ప్రత్యేక పూజలు!

రాజమౌళి సినిమాలు..

Advertisement

రాజమౌళి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వారణాసి సినిమా చేస్తున్నారు. మొదట యాక్షన్ అడ్వెంచర్ గా ప్రకటించినా అటు మైథాలజికల్ టచ్ కూడా ఈ సినిమాలో ఉండడంతో అసలు రాజమౌళి ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దబోతున్నారనే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది. పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా ..పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×