E-Paper
Advertisement

భారత్‌లోకి టపాసులు ఎప్పుడు వచ్చాయి.. దీపావళి బాణాసంచా వెనుక ఇంత చరిత్ర ఉందా?

భారత్‌లోకి టపాసులు ఎప్పుడు వచ్చాయి.. దీపావళి బాణాసంచా వెనుక ఇంత చరిత్ర ఉందా?
Advertisement

Diwali Firecrackers History| దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దీపాల వెలుగులు, టపాసుల శబ్దాలు వాటి కలర్‌ఫుల్ వెలుగులు. ఆకాశంలో మెరిసే బాణసంచా చూస్తుంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, విజయోత్సవాల్లో కూడా టపాసులు కాల్చడం సాధారణంగా మారింది. అయితే ఈ సంప్రదాయం భారతదేశంలోనే మొదలైందని చాలామంది భావిస్తారు. కానీ టపాసుల చరిత్ర దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం చైనాలో ప్రారంభమైంది. అయితే ఇది మన దేశంలో ఎలా వచ్చింది? ఈ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

ప్రాచీన చైనాలో మొదలైన టపాసుల సంప్రదాయం

చరిత్రకారుల ప్రకారం.. క్రీస్తుపూర్వం 200 ప్రాంతంలో చైనాలో ప్రజలు వెదురు కట్టెలను మంటల్లో వేసేవారు. వేడికి వెదురు లోపల గాలి విస్తరించి, పెద్ద శబ్దంతో అవి పేలేవి. ఈ శబ్దాలు దుష్టశక్తులను, చెడు ప్రభావాలను దూరం చేస్తాయని అప్పటి ప్రజలు నమ్మేవారు.
అందుకే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వెదురు కట్టెలను కాల్చేవారు. ఇవి నేటి రంగురంగుల టపాసుల్లా ఉండేవి కావు. అయినప్పటికీ, వేడుకల్లో పెద్ద శబ్దాలు చేసే సంప్రదాయానికి ఇవే ఆరంభంగా నిలిచాయి.

గన్‌పౌడర్‌ ఆవిష్కరణతో మారిన టపాసుల రూపం

Advertisement

తొమ్మిదో శతాబ్దంలో చైనాకు చెందిన రసవాదులు, తావోయిజం మత సాధువులు వివిధ పదార్థాలతో ప్రయోగాలు చేశారు. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేందుకు ఒక ఔషధాన్ని కనుగొనాలనే ప్రయత్నంలో గంధకం, బొగ్గు, పొటాషియం నైట్రేట్‌ కలిపారు. ఈ మిశ్రమం మంట తగిలినప్పుడు తీవ్రమైన ప్రతిచర్య చూపించింది. దీన్నే గన్‌పౌడర్‌గా (మందుగుండు) గుర్తించారు. తర్వాత ఈ మిశ్రమాన్ని వెదురు ముక్కలు, కాగితపు గొట్టాల్లో నింపడం ప్రారంభించారు. అవి పెద్ద శబ్దాలు, వెలుగులు సృష్టించాయి. దీంతో ఆధునిక బాణసంచా అభివృద్ధికి మార్గం ఏర్పడింది.

చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన టపాసులు

కాలక్రమేణా చైనా గన్‌పౌడర్‌ పరిజ్ఞానం ఇతర ప్రాంతాలకు చేరింది. 13వ శతాబ్దం నాటికి మధ్య ఆసియా, అరబ్‌ ప్రాంతాలకు ఈ టెక్నాలజీ వ్యాపించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి యూరప్‌కు చేరింది. మొదట గన్‌పౌడర్‌ను యుద్ధాలు, ఆయుధాల తయారీలో ఉపయోగించారు. తర్వాత వేడుకల్లో వినోదం కోసం కూడా బాణసంచా వాడటం మొదలైంది.

Advertisement

Also Read: డెయిరీ ఫామ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ 5 జాతుల ఆవులే బెస్ట్

15వ శతాబ్దం నాటికే భారత్‌లో టపాసుల వాడకం

భారత్‌కు టపాసులు ఎప్పుడు వచ్చాయనే విషయంపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే 15వ శతాబ్దం నాటికే రాజుల వేడుకల్లో బాణసంచా ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. 1443లో విజయనగర మహారాజు దేవరాయల ఆస్థానాన్ని పర్షియా రాయబారి అబ్దుర్‌ రజాక్‌ సందర్శించారు. మహానవమి వేడుకల్లో అద్భుతమైన అగ్ని విన్యాసాలు చూసినట్లు తన ప్రయాణ వివరాల్లో పేర్కొన్నారు.
మొఘలుల కాలంలో పెళ్లిళ్లు, పండుగలు, రాజ వేడుకల్లో బాణసంచా మరింత ప్రాచుర్యం పొందింది. క్రమంగా సామాన్య ప్రజలు కూడా దీన్ని ఉపయోగించడం ప్రారంభించారు. యుద్ధంలో కూడా మందుగుండు 15వ శతాబ్దంలోనే భారత్‌లో మొట్టమొదటి చక్రవర్తి బాబర్ ప్రయోగించాడు.

Also Read: స్కూల్‌ వెళ్లడానికి మీ పిల్లాడు భయపడుతున్నాడా? పిల్లలు బుల్లీయింగ్‌‌కు గురవుతున్నట్లు తెలిపే సంకేతాలు ఇవే

కాలక్రమేణా టపాసులు దీపావళిలో భాగమయ్యాయి

దీపావళి ప్రధానంగా వెలుగు, సంపద, ఆనందానికి ప్రతీక. నూనె దీపాలు వెలిగించడం ఈ పండుగలో పురాతన సంప్రదాయం. కాలక్రమేణా టపాసులు కూడా వేడుకల్లో భాగమయ్యాయి. అయితే దీపావళి ప్రాముఖ్యత కేవలం బాణసంచాకే పరిమితం కాదు. దీపాల వెలుగు, కుటుంబ సభ్యుల కలయిక, ఆనందమే ఈ పండుగకు అసలైన ప్రత్యేకత. చైనాలో వెదురు ముక్కలతో మొదలైన సంప్రదాయం ఇలా ప్రపంచవ్యాప్తంగా వేడుకల్లో భాగమైంది.

Related News

59 ఏళ్ల వయసులో టీనేజర్ లాంటి ఫిట్‌నెస్.. ఇండస్ట్రీలోనే అత్యంత ఫిట్ హీరో హెల్త్ సీక్రెట్

పిల్లలు పబ్లిక్ ప్లేస్‌లో మొండి చేస్తున్నారా? ఈ టిప్స్‌తో సులభంగా హ్యాండిల్ చేయండి

దీపావళి వంటకాలు తిని కడుపునొప్పి తీవ్రంగా అనిపిస్తోందా? ఈ సమస్యలుంటే సర్జరీ అవసరం

కొత్త డేటింగ్ ట్రెండ్.. ప్రేమలో అనుబంధం తగ్గితే బ్రేకప్ చేయకుండా మంకీ బ్రాంచింగ్

దీపావళికి టపాసులు కాలుస్తూ గాయపడ్డారా? కాలిన గాయలకు వెంటనే ఇలా చేయండి

పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

టైం లేనప్పుడు..ఈ టేస్టీ కిచిడిని ట్రై చేయండి!రుచి అదిరిపోతుంది

Big Stories

Advertisement
×