E-Paper
Advertisement

పాకిస్తాన్ కోసం ప్రాణాలైనా ఇస్తా, అందుకే హ‌ర్షిత్ రాణాపైకి దూసుకెళ్లాను

పాకిస్తాన్ కోసం ప్రాణాలైనా ఇస్తా, అందుకే హ‌ర్షిత్ రాణాపైకి దూసుకెళ్లాను
Advertisement

Sufiyan Muqeem On Harshit Rana:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match) మధ్య దోహా (West End Park International Cricket Stadium, Doha) వేదిక‌గా ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, పాక్ ఆటగాళ్ల మధ్య మాటలు యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా హర్షిత్ రాణాను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ (Sufiyan Muqeem On Harshit Rana) రెచ్చిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మాజీ ఇండియన్ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు.

పాకిస్తాన్ కోసం ప్రాణాలైనా ఇస్తా, అందుకే హ‌ర్షిత్ రాణాపైకి దూసుకెళ్లాను

హర్షిత్ రాణాపైకి దూసుకు వచ్చిన సంఘటనపై స్వయంగా పాకిస్తాన్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ (Sufiyan Muqeem) ఓ వీడియో కాల్ ద్వారా స్పందించాడు. ఈ సంఘటనపై పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఓ వ్యక్తి సుఫియాన్ ముఖీమ్ కు వీడియో కాల్ చేయగా.. హర్షిత్ రాణా సంఘటనపై క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ జోలికి ఎవరు వచ్చిన ఊరుకునేది లేదని ఈ సందర్భంగా సుఫియాన్ ముఖీమ్ కామెంట్ చేశాడు. మొదటి బంతి నుంచి పాకిస్తాన్ ప్లేయర్లను హర్షిత్ రాణా స్లెడ్జింగ్ చేశాడని ఫైర్ అయ్యాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

ఈ క్రమంలోనే అతనిపై ప్రతిస్పందించాల్సిన అవసరం వచ్చిందని వెల్లడించాడు. తనపై రెండు మ్యాచ్ ల‌ నిషేధం లేదా భారీ జరిమానా విధించిన పర్లేదని తాను అనుకున్నట్టు వ్యాఖ్యానించాడు. ముందుగా తన దేశమే ముఖ్యమని భావించి.. హర్షిత్ రాణా వికెట్ పడిన తర్వాత అతనిపైకి దూసుకు వెళ్లినట్టు క్లారిటీ ఇచ్చాడు. ఆ సమయంలో తనను అలీ రాజా అడ్డుకున్నాడని.. లేకపోతే హర్షిత్ రాణాపై దాడి చేసే వాడిని పేర్కొన్నాడు. దీంతో వీడియో కాల్ లో సుఫియాన్ ముఖీమ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో సుఫియాన్ ముఖీమ్ పై ఐసీసీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగగా… తిలక్ వర్మ సేనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో చిత్తయిన టీమిండియా… గ్రూప్ సైజులో దారుణంగా ఓడిపోయింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుపై రేపు విక్టరీ కొడితే సెమీస్ కు టీమిండియా దూసుకువెళ్ళనుంది.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

?utm_source=ig_web_copy_link&cnvx=NTc4MTIwNjQ2YQ==

Related News

అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

అభిషేక్, వైభ‌వ్, తిలక్ లాంటి వాళ్లు ఉన్నా చిత్తుగా ఓడించాం

గురువు గంభీర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేందుకే హ‌ర్షిత్ రాణా రౌడీ బిహేవ్ చేశాడు

ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో నిల‌దొక్కుకోలేడు

టీమిండియాపై విజ‌యం..నేష‌న‌ల్ హాలీడే ప్ర‌క‌టించిన పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్‌

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ

Big Stories

Advertisement
×