BigTV English

Saiyaara Movie: కాపీ కొట్టిన సినిమాకు ఎందుకురా అంత గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు

Saiyaara Movie: కాపీ కొట్టిన సినిమాకు ఎందుకురా అంత గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు

Saiyaara Movie: ఈమధ్య యువతకు ఏ సినిమా నచ్చుతుందో.. ఏ సినిమా నచ్చడం లేదో అర్ధం కావడం లేదు. కథ ఉంటే చాలా చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా సినిమాను హిట్ చేస్తున్నారు. ఇక దీంతో ఇదే మంచి సమయం అని మేకర్స్.. వేరే వేరే సినిమాల నుంచి కాపీ కొట్టిన సీన్స్ ను మొత్తం కలిపి కొత్త సినిమా చేసి పడేస్తున్నారు. ఒకరేమో వారి సినిమాల్లోని సీన్స్ వారే కాపీ కొడతారు. ఇంకొకరు.. వేరే వాళ్ల సినిమాల్లోని సీన్స్ కాపీ కొడతారు. ఇంకొంతమంది సీరియల్ సీన్స్ కాపీ కొడతారు. ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు అని చెప్పుకొనేవారు వేరే దేశంలో రిలీజ్ అయిన సినిమా సీన్లను కాపీ కొట్టి.. తమ సొంత ప్రయత్నం అని చెప్పుకొస్తూ జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు.


 

తాజాగా బాలీవుడ్ లో సైయారా అనే సినిమా రిలీజ్ అయ్యింది. అసలు ఇందులోని ప్రేమకథను చూసి.. థియేటర్ లో యువత కంటనీరు పెట్టుకుంటున్నారు. ఆడ, మగా అని తేడా లేకుండా ఏడ్చేస్తున్నారు. అంతలా ఏముంది ఈ సినిమాలో.. అంత కొత్తగా తీసారా అంటే.. అబ్బే అదేమీ లేదు ఇదొక కొరియా సినిమాను కాపీ కొట్టి తీసారని నెటిజన్స్ కనిపెట్టేసారు. బాలీవుడ్ నటుడు అహాన్ పాండే, అనిత్ పద్దా జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా సైయారా. ఆదిత్య చోప్రా సమర్పకుడిగా, అక్షయ్ విధాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమా జూలై 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అసలు సినిమా థియేటర్ లోనే వెక్కి వెక్కి ఏడుస్తున్న అమ్మాయిలు, అబ్బాయిల వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.


Saiyaara: సినిమా చూస్తూ థియేటర్లలోనే ఏడ్చేసిన యువత..మరీ ఇంత దారుణమా?

 

సోషల్ మీడియా వచ్చాకా ఏది దాచాలన్నా దాచే పరిస్థితి లేదు. దీంతో కొందరు నెటిజన్స్ ఏం చేసారంటే.. అసలు ఈ సినిమా ఒరిజినల్ నా.. కాపీనా అని టెస్ట్ చేశారు. ఇంకేముంది అసలు గుట్టు బయటపడింది. మోహిత్ సూరి ఈ సినిమాను కొరియన్ ఫిల్మ్ ఏ మూమెంట్ టూ రిమెంబర్ అనే సినిమా నుంచి కాపీ కొట్టాడు. పోనీ.. లైన్ మాత్రం తీసుకొని సీన్స్ ఏమైనా మార్చాడా అంటే అది లేదు. మక్కీకి మక్కీ దింపేశాడు. దీంతో నెటిజన్స్ అతని ఆదుకోవడం మొదలుపెట్టారు. మోహిత్ సూరి సినిమాలు అన్ని హిట్టే.. అది కాపీ అని తెలిసేవరకు అని కొందరు.. ఇక్కడ హిట్ అయ్యినట్లు కొరియాలో హిట్ కాలేదేమో.. అందుకే ఇంతలా ఏడుస్తున్నారు అని ఇంకొందరు. కాపీ కొట్టిన సినిమాకు ఎందుకురా అంత గుండెలు బాదుకుని ఏడుస్తున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

సైయారా కథ విషయానికొస్తే.. వాణీ బత్రా (అనీత్ పద్దా ) ఒక రచయిత. పేరు లేకుండా పాటలు రాస్తూ ఉంటుంది. ఆమె పెళ్లి చేసుకోబోయే సమయంలో పెళ్లి కొడుకు వెళ్లిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఇక పాటలు రాయడం మానేసి జర్నలిస్ట్ గా మారుతుంది. క్రిష్ కపూర్ (అహాన్ పాండే)  ఒక సింగర్, అతనికి కోపం ఎక్కువ. దాని వలనే ఎన్నో మంచి మంచి అవకాశాలు అతడిని వదిలిపోతాయి. దీంతో మరింత కోపంతో ఊగిపోతూ ఉన్న సమయంలో అతడికి వాణీ  రాసిన డైరీ కనపడుతుంది. అందులోని కవితలను.. సాంగ్స్ గా మార్చి హిట్ సింగర్ గా మారతాడు. అలా వాణీ , క్రిష్ పరిచయం.. ప్రేమకు దారితీస్తుంది. కానీ, విధివారిని విడదీస్తుంది. వాణీ – క్రిష్ విడిపోవడానికి కారణాలు ఏంటి.. ?  వాణీ కి ఉన్న సమస్య ఏవిటి.. ?  వీరిద్దరూ చివరకు కలుస్తారా.. ? అనేది సినిమా. కథలో కొత్తదనం లేకపోయినా.. మోహిత్  చూపించిన విధానం.. హీరోహీరోయిన్ల నటన ఆకట్టుకోవడంతో సినిమా.. కాపీ అన్న ఫీల్ ఎక్కడా కనిపించదు. దాని వల్లనే ఈ సినిమా హిట్ అయ్యిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. 

Related News

Director Bobby: ‘మన శంకర వరప్రసాద్‌ గారూ’ మూవీపై డైరెక్టర్‌ బాబీ రివ్యూ.. ఏమన్నారంటే!

OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే

Deepika Padukone: దీపికా ఎక్కడా? నువ్వు స్పందించే టైం వచ్చింది..

Mirai – Kishkindhapuri : కలెక్షన్స్‌లో మిరాయ్‌ ని దాటేసిన కిష్కంధపురి.. ఇదెక్కడి ట్విస్ట్ అసలు

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Deepika Padukone : తీసేస్తే తీశారు కానీ… కెరీర్‌‌పై గట్టి దెబ్బ కొట్టారు

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Big Stories

×