BigTV English

AP Liquor Scam: మద్యం కుంభకోణం సొమ్ముతో మాఫియా ముఠా జల్సా..

AP Liquor Scam: మద్యం కుంభకోణం సొమ్ముతో మాఫియా ముఠా జల్సా..

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో ప్రదాన నిందితుడుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులు చూసి సిట్ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురైయ్యారు. మద్యం కుంభకోణంలో దోచుకున్న డబ్బుతో అత్యంత విలువైన, విలాశవంతమైన జీవితం గడిపారని సిట్ తెలిపింది. తరచూ విదేశాలకు వెళ్లి జల్సాలు చేసేవారని, అక్కడ ఖరీదైన హోటళ్లు, రిసార్టుల్లో బస చేసేవారని, సిట్ వెల్లడించింది. నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి హైదరాబాద్‌ చుట్టుపక్కల భారీగా భూములు కొన్నారని, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశారని. రాజ్‌ కెసిరెడ్డి తన పేరు మీద, సొంత సంస్థ ఈషాన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పేరు మీద హైదరాబాద్‌ శివారు షాబాద్, మంచనపల్లె, దామరపల్లె వంటి చోట్ల 92 ఎకరాలు కొనుగోలు చేశారని సిట్ అధికారులు తెలిపారు. ఆ భూములను హెచ్‌ఎండీఏలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ క్యాటగిరీలోకి మార్చుకుని భారీగా లబ్ధి పొందాలని రాజ్‌ కెసిరెడ్డి పన్నాగం పన్నారని. ఆయన ముడుపుల సొమ్ముతోనే భూములు కొన్నారని సిట్‌ అధికారులు వెల్లడించారు.


ఏపీ లిక్కర్ కేసులో వందల కోట్లు వెనకేసుకున్న ఎ1 రాజ్ కెసిరెడ్డి
మద్యం ముడుపుల రూపంలో సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు ఏ1 రాజ్‌ కెసిరెడ్డి, ఏ9 తూకేకుల ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి పలు స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ కంపెనీల నిర్వహణ, పరిశోధన వ్యయం, ఉద్యోగుల వేతనాలకు మద్యం ముడుపుల సొమ్మే ఖర్చు చేశారని సిట్ స్పష్టం చేసింది. అలాగే రాజ్ కేసిరెడ్డి సినిమా రంగంలోకి అడుగుపెట్టి రాజ్‌ కెసిరెడ్డి ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సినిమాలు కూడా తీశారు. రాజ్ కేసిరెడ్డి నిర్మించిన స్పై సినిమాకు 25 కోట్లు వరకు ఖర్చయితే 12 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలే అధికారికంగా చూపించినట్లు సిట్ తెలిపింది.

విదేశాల్లో స్టార్టప్ కంపెనీలు.. పెట్టుబడులు..
ఇంతే కాదు మద్యం కుంభకోణం సొమ్ముతో జాంబియా, టాంజానియా తదితర దేశాల్లో మైనింగ్, ఇనుప ఖనిజం తవ్వకాలు చేపట్టేందుకు, కర్మాగారాలు పెట్టేందుకు ఈ ముఠా సన్నాహాలు చేసింది. వారి ట్రావెల్‌ పత్రాలు, పాస్‌పోర్టుల ద్వారా ఈ విషయం వెల్లడైందని సిట్ వెల్లడించింది. ముడుపుల సొమ్మును రాజ్‌ కెసిరెడ్డి, ఆయన అనుచరగణం హవాలా మార్గం ద్వారా విదేశాలకు తరలించి, ఆ సొమ్ముతో ఆయా దేశాల్లో పలు కంపెనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించామని తెలిపారు. నల్లధనాన్ని వైట్‌లోకి మార్చేందుకు రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ అనేక ప్రయత్నాలు చేసినట్లు సిట్ తెలిపింది.


వైసీపీ మరోసారి అధికారంలోకి రాకపోయినా.. ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు
2024లో వైసీపీ మరోసారి అధికారంలోకి రాకపోయినా, ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఆ సొమ్మును విదేశాలకు తరలించాని సిట్‌ వెల్లడించింది. రాజ్‌ కెసిరెడ్డి, ఆయన ముఠా సభ్యులైన బూనేటి చాణక్య, ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, సైఫ్‌ అహ్మద్, సైమన్‌ ప్రసన్‌ హవాలా మార్గాల్లో విదేశాలకు డబ్బును తరలించారు. ఆ డబ్బుతో యూఏఈ, జింబాబ్వే, థాయ్‌లాండ్‌లలో పెట్టుబడులు పెట్టానట్లు సిట్ గుర్తించింది.. హవాలా, మనీ లాండరింగ్‌లో ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ డబ్బుతోనే దుబాయ్‌లో టెక్కర్‌ ట్రేడింగ్‌ ఎల్‌ఎల్‌సీ, టెక్కర్‌ ట్రక్‌ యూఏఈ, ట్రాన్స్‌పోర్ట్‌ ఎల్‌ఎల్‌సీ, హోమ్‌హేవ్స్‌ ఆన్‌లైన్‌ ఫర్నిచర్‌ ,కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ వెల్లడించింది. మద్యం కేసు దర్యాప్తు ప్రారంభమైన వెంటనే, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముఠా సభ్యుల్లో పలువురు విదేశాలకు పారిపోయారని. అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని సిట్ తెలిపింది.

Also Read: నిద్ర కోసం మెలటోనిన్ వాడుతున్నారా? అయ్యయ్యో

రాజ్ కెసిరెడ్డి ముఠా సభ్యులు ఆదాయ పన్ను పత్రాల్లో చూపిన వివరాలకు, వారి బ్యాంకు లావాదేవీలకు పొంతన లేదని, రాజ్‌ కెసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ తన వార్షిక ఆదాయం 7 లక్షలేనని ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన వివరాల్లో తెలిపారు. కానీ, ఆయన ఖాతాల్లో రెండున్నరేళ్లలో 80 లక్షలు నగదు జమ అయినట్లు గుర్తించామని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

Related News

Women Health Camps: సెప్టెంబ‌ర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కొత్త మలుపు.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, వైసీపీలో గుబులు

Temple Stampedes: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఆ ఎస్పీని టార్గెట్ చేసుకున్న వైసీపి.. ప్రభుత్వం ఘాటు రిప్లై!

AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Big Stories

×