Snake in Motor Box: తరచుగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు.. వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలావరకు అందర్నీ భయాందోళనకు గురి చేసే వీడియోలు ఉంటాయి. అయితే తాజాగా ఓ నాగుపాము వీడియో తెరపైకి వచ్చింది. మోటార్ ఆన్ చేద్దామని వెళ్లిన రైతుకు షాక్ ఇస్తూ.. ఓ నాగు పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. కరెంటు బాక్స్ లోనే పాము పడగ విప్పి బుసలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొలాల్లో మీటర్లు ఆన్ చేసే ముందు రైతులు జాగ్రత్తగా ఉండాలని.. ఈ వీడియోను చూసిన అధికారులు చెబుతున్నారు.
సంఘటన వివరాలు:
వివరాలు ప్రకారం, ఓ రైతు పొలంలోని మోటార్ బాక్స్ వద్దకు వెళ్లి మోటార్‌ను ఆన్ చేయాలని ప్రయత్నించాడు. అయితే బాక్స్ తెరిచిన వెంటనే అక్కడినుండి.. పెద్దసైజు నాగుపాము ఒక్కసారిగా బయటకు వచ్చింది. పాము పడగ విప్పి, బుసలు కొడుతూ రైతు వైపు చూసింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయింది.
ఈ పాము బాక్స్ లో ఎలా దాగి ఉండగలిగిందన్నదే.. ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. సాధారణంగా మోటార్ బాక్స్‌లు వేడిగా ఉండడం వల్ల.. పాములు వర్షాకాలంలో ఇలాంటి ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతాయి. అలాగే పొలాల్లో వరుసగా వర్షాలు కురవడం వల్ల కొన్ని పాములు పొలాల నుంచి బయటకు వస్తూ.. భద్రమైన ప్రదేశాల్లో ఆశ్రయం తీసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
రైతులకు హెచ్చరికగా మారిన వీడియో:
ఈ వీడియోను చూసిన అధికారులు, నిపుణులు ప్రజలకు కొన్ని కీలకమైన సూచనలు చేస్తున్నారు.
మోటార్ బాక్స్ ఓపెన్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి.
బాక్స్‌లలో సీలింగ్ లేదా గట్టి మూతలు పెట్టడం ద్వారా ఇలాంటివి నివారించవచ్చు.
వాటర్ ప్రూఫ్ కవర్స్ లేదా మష్ నెట్లు వంటివి ఉపయోగించడం వల్ల.. పాములు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.
పొలాల్లో పని చేసే సమయంలో పాదరక్షలు ధరించడం, జాగ్రత్తగా చుట్టూ చూడడం చాలా అవసరం.
పాముల ప్రవర్తనపై నిపుణుల అభిప్రాయం:
పాములు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అవి భయపడినప్పుడే తమను రక్షించుకోవడానికి దాడి చేస్తాయి. ఈ సందర్భంలో కూడా పాము తనను ప్రమాదంలో ఉందని భావించి.. రియాక్ట్ చేయడం జరిగింది. మానవులు పాములను గమనించిన వెంటనే దూరంగా ఉండటం, పాములను హింసించకుండా.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఈ వీడియోను చూశాక మీరు కూడా మీ పొలాల్లో, ఫాంహౌస్‌లలో, మోటార్ బాక్స్‌ల దగ్గర జాగ్రత్తలు పాటించండి. ఒక చిన్న అప్రమత్తతే ప్రాణాపాయాన్ని దూరం చేయగలదు. జాగ్రత్తే మనకు రక్ష.
మోటార్ ఆన్ చేద్దామని వెళ్లిన రైతుకు షాక్.. మీటర్ లో బుస్సుమన్న పాము..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
పొలాల్లో మీటర్లు ఆన్ చేసే ముందు రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న అధికారులు pic.twitter.com/1hycbS38zs
— BIG TV Breaking News (@bigtvtelugu) July 22, 2025