Prithviraj Sukumaran’s wife harassed for 7 years: మలయాళ స్టార్ హీరో, సలార్ ఫేం పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన బాగా సుపరిచితం. ఇక సలార్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యారు. వరద రాజమన్నార్గా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ఆయన నటిస్తున్న రెండో చిత్రమిది. మలయాళంలో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఏడేళ్లుగా వేధింపులు
అయితే తాజాగా పృథ్వీరాజ్ భార్య సుప్రియ మీనన్ వార్తల్లో నిలిచారు. కొన్నేళ్లుగా తాను వేధింపులకు గురవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఆమె ఓ పోస్ట్ షేర్ చేశారు. అయితే తనని వేధిస్తుంది ఓ మహిళని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఆమె ఫోటో షేర్ చేస్తూ.. కొంతకాలంగా ఈమె నన్ను వేధిస్తోంది. తరచూ అసభ్యకర కామెంట్స్ చేస్తూ నాపై ద్వేషం చూపిస్తోందంటూ సుప్రీయ మీనన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. “ఈమే పేరు క్రిస్టినైల్డో. కొన్నేళ్లుగా ఈమె నన్ను వేధిస్తూ వస్తోంది. ఆమెను బ్లాక్ చేసిన కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నాపై ద్వేషం చూపిస్తోంది. దాదాపు 2018 నుంచి ఇదే జరుగుతుంది.
ఫేక్ అకౌంట్స్ తో అసభ్య కామెంట్స్
ఆమె ఏ ఫిల్టర్ కూడా నాపై తనకు ఉన్న ద్వేషాన్ని దాచిపెట్టలేకపోతున్నాయి. 2018 నుంచి ఈమె ప్రతి అకౌంట్ని బ్లాక్ చేయడమే నా నిత్య జీవితంలో ఓ భాగమైంది. తరచూ నాపై విద్వేషకరమైన కామెంట్స్ చేస్తూ నన్ను బాధపెడుతోంది. తనకు చిన్న కుమారుడు ఉన్నాడని వదిసాను. ఎలాంటి చర్యలు తీసుకోకుండ మానవత్వంతో వదిలేస్తూ వచ్చాను. కానీ, ఇప్పుడామే నా తండ్రిపై కూడా నిందలు వేస్తూ కామెంట్స్ చేస్తోంది. ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయనను ఉద్దేశిస్తూ నిందలు వేస్తోంది. నేను ఎన్నోసార్లు ఆమె అకౌంట్ని బ్లాక్ చేశాను. అయినా ఫేక్ ఖాతాలు సృష్టించుకుని మరి అభ్యంతరకర కామెంట్స్ పెడుతూ నన్ను వేధించడమే పనిగా పెట్టుకుంది‘ అని సుప్రియ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరో భార్యకు కూడా ఆన్లైన్లో వేధింపులు తప్పలేదు అని అంత అనుకుంటున్నారు. కాగా ప్రముఖ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సుప్రీయ మీనన్ కు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో 2011లో వీరు పెద్ద అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు జన్మించింది. ప్రస్తుతం సుప్రియ భర్తతో కలిసి సినిమాలకు నిర్మిస్తుంది. వీరిద్దరి పేరుపై సుప్రియ పృథ్వీరాజ్ పేరుతో ప్రొడక్షన్ సంస్థ ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నిర్మాతగా రాణిస్తున్నారు.