Today Gold Rate: బంగారం పగబట్టినట్టుగా ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త బంగారం తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ వారి ఆనందం మూనాళ్ల ముచ్చటే అయ్యింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,820 ఉండగా.. నేడు రూ.1,00,480 పలుకుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,500 ఉండగా.. నేడు రూ.92,100 వద్ద పలుకుతోంది. నేడు తులం బంగారంపై రూ.660 పెరిగిందని చెప్పుకోవచ్చు.
భగ్గుమంటున్న బంగారం..
అయితే బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. దీంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతారు. అసలే శ్రావణ మాసం వచ్చింది. ఇప్పుడు పెళ్లీళ్లు, గృహప్రవేశాలు వంటి అనేక ఫంక్షన్లు ఉంటాయి. బంగారం ఇలా ఆందలాన్నీ తాకుతుంటే సామాన్య ప్రజలే కాదు.. అందరు బంగారం కొనాలంటే భయపడుతారు. అంతేకాకుండా బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలు నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో విధించిన టారిఫ్ సుంకాలు ఆగస్టు 1 నుంచి మళ్లీ అమల్లోకి రానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నారు. దీంతో గోల్డ్ ధరలకు మళ్లీ గిరి తల రాణిలా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష రూపాయలు ఇప్పటికే తాకిన ఈ ధర త్వరలోనే రూ.1.5 లక్షల వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ నేటి బంగారం ధరలు
నిన్నటి బంగారంతో.. నేటి బంగారం ధరలు పోల్చగా నిన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,820 కాగా.. నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,500 కాగా.. నేడు రూ.92,100 పలుకుతోంది.
విశాఖపట్నం బంగారం ధరలు
విశాఖలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,100 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,100 వద్ద ఉంది.
ముంభై బంగారం ధరలు
ముంభైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,100 వద్ద పలుకుతోంది.
ఢిల్లీ బంగారం ధరలు
ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,630కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,250 వద్ద పలుకుతోంది.
Also Read: ఏపీ అభివృద్ధి కోసం సింగపూర్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ..
నేటి సిల్వర్ ధరలు..
అరే ఎంట్రా ఇది.. బంగారంమే అంటే దానికి పోటిగా.. నేను తగ్గేదేల లే అంటూ.. ఇది కూడా పెరిగిపోతుంది. వెండి ధరలు మళ్లీ నేడు రూ.100 రూపాయిలు పెరిగింది. దీంతో నేటి కేజి వెండి ధర రూ.1,27,000 వద్ద కొనసాగుతోంది. అలాగే.. ఢిల్లీ, కలకత్త, ముంభై ప్రాంతాల్లో రూ.1,17,000 పలుకుతోంది.