E-Paper
Advertisement

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి సెన్సార్ షాక్.. ఆ సీన్స్ తీసేస్తేనే రిలీజ్!

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి సెన్సార్ షాక్.. ఆ సీన్స్ తీసేస్తేనే రిలీజ్!
Advertisement

Matrubhoomi Controversy: థియేటర్లలోకి రాకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సల్మాన్ ఖాన్ నటించిన సినిమా ‘మాతృభూమి’అవును …ఈ ఏడు బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే సెన్సార్ వివాదాల్లో చిక్కుకోవడం ఇపుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.

మాములుగా సల్లూ భాయ్ సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి.గల్లా పెట్టెలు గలగల లాడుతాయి.అయితే ఈ సారి రిలీజ్ కన్నా ముందే సినిమాలు వివాదాల్లో ఇరుక్కోవడం సల్లూ బాయ్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది.దీని కంతటికీ ప్రదాన కారణం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పై అబ్జెక్షన్ చెప్పడమే.

దేశ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్

Advertisement

బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ‘మాతృభూమి’ సినిమాలో అంతర్జాతీయ రాజకీయాలు, దేశ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్ ని చూపించారని సమాచారం.ముఖ్యంగా చైనాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ఒక రీమేక్ పోస్టర్ షాట్‌పై సెన్సార్ బోర్డు గట్టిగానే అబ్జెక్షన్ చెప్పినట్టు తెలుస్తుంది.దేశానికి సంబందించిన సున్నితమైన విషయాలని, అలాగే దేశ సార్వభౌమత్వానికి, ఇతర దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సీన్స్ అన్నింటిని చేంజ్ చేయాలని ,లేకపోతె సినిమాకి క్లియరెన్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పిందట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్.

భారత్ సినిమా కూడా ఇలాగే కాంట్రవర్సీ

సినిమా విషయానికి వస్తే ..2020 నాటి గురుగ్రామ్ అల్లర్ల నేపథ్యాన్ని కూడా టచ్ చేసినట్లు బీటౌన్ లో గట్టిగానే వినిపిస్తుంది.రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా తీసే క్రమంలో మతపరమైన అంశాలని, భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) ప్రోటోకాల్స్‌కు ఇబ్బంది కలిగించేలా కొన్ని డైలాగులు ఉన్నాయని, అందుకే సెన్సార్ ఇవలేదని, దానితో ఇక తప్పేలా లేదని ‘మాతృభూమి’ మూవీ టీమ్ వెనక్కి తగ్గిందట.ఇక గతంలో సల్లూ చేసిన భారత్ సినిమా కూడా ఇలాగే కాంట్రవర్సీలో ఇరుక్కున్న సంగతి తెల్సిందే.

Advertisement

ఇక ఈ సినిమాలో దాదాపు 40 సెకన్ల లెంత్ ఉన్న ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తిగా కట్ చేయాలని దీనితో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్, బూతు పదాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే వివాదాస్పద పోస్టర్లను బ్లర్ చేయాలని సూచించిందట సెన్సార్ బోర్డ్.అయితే బాలీవుడ్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ కానీ, ఇటు CBFC వర్గాలు కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ వదలకపోవడం ఇక్కడ గమనార్హం. చూడాలి మరి ముందు ముందు అయినా వీటిపై ఏమైనా క్లారిటీ వస్తుందేమో !

also read:బుల్లితెరపై ‘పెద్ది’ జాతర.. నెట్‌ఫ్లిక్స్ డేట్ ఫిక్స్.. ఇక డిజిటల్ స్క్రీన్స్ షేక్ అవ్వాల్సిందే!

Related News

సందీప్ కిషన్ సిగ్మా సర్దుకున్నట్టేనా? అసలు లెక్క ఇదే!

శర్వా ‘భోగి ‘కూడా ఆ దారిలోనే వెళ్తుందా?

సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా.. ఎంతమంది వారసులంటే?

రష్మిక రణబాలి ఒకే చేయడానికి అతనే కారణమా? విజయ్ మాత్రం కాదండోయ్!

సీరియల్‌లో రూ.750తో మొదలు.. ఇప్పుడు కోట్లలో పారితోషికం! రచితా రామ్ జర్నీ ఇదే

‘పుష్పక విమానం’ వెనుక సింగీతం అసలైన ఛాలెంజ్?

విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×