BigTV English

Tollywood Movies : త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే ఈ వ్యక్తి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

Tollywood Movies : త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే ఈ వ్యక్తి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు తెరకెక్కించిన ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించాడు.. గతేడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మహేష్ బాబు శ్రీ లీల జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని పాత్రలు కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. అందులో నటించిన కొందరు నటులు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలను కనిపిస్తూ ఉంటారు. త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే పమ్మి సాయి కమెడియన్ గా అందరికి తెలుసు. అతని సైలెంట్ పంచులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే గురూజీ తన సినిమాల్లో ప్రత్యేకంగా ఒక పాత్రను ఇస్తారు. గురూజీ మెచ్చిన ఆ కమెడియన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


పమ్మి సాయి బ్యాగ్రౌండ్ ఇదే..

రొటీన్ కథనే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్లు అందుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు త్రివిక్రమ్.. గురూజీ దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన జులాయి, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాను తెరకెక్కించాడు.. ఇది ఒకే అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలు అన్నిటిలో పమ్మి సాయి ఉన్నాడు. ఇతను త్రివిక్రమ్ కు సొంత బంధువు కావడం వల్లే అతన్ని ఎక్కువగా పెడుతున్నాడని తెలుస్తుంది. అతని కామెడీ టైమింగ్ కూడా బాగా నచ్చడంతోనే అతనితో తన సినిమాల్లో క్యారక్టర్ ఇస్తున్నాడు..


Also Read : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

త్రివిక్రమ్ – పమ్మి సాయి కాంబోలో వచ్చిన సినిమాలు.. 

త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని పంచు డైలాగులు బాగా ఫెమస్. వాటిని పమ్మి సాయి స్టైల్లో చెప్పిస్తే ఇక బొమ్మ సూపర్ హిట్టే.. త్రివిక్రమ్‌ సినిమాలో పమ్మి సాయి ఎక్కువగా కనిపిస్తాడు. పమ్మి సాయి అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికీ దారేదీ, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అఆ, అరవింద సమేతా, సినిమాల్లో నటించాడు పమ్మి సాయి. అంతేకాదు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..దర్శకత్వం చేసిన 11 సినిమాల్లో 10 సినిమాలలో పమ్మి సాయి ఉంటాడు.. వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వం వల్లే సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నాడు. పమ్మి సాయి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.. ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. వెంకటేష్ తో కూడా సినిమా చేస్తున్నాడు.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×