Samantha:ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత మహేష్ బాబు(Maheshbabu), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (NTR) వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. వివాహం తర్వాత ఒకటి రెండు చిత్రాలలో నటించింది. ఇక వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్నారు అనుకునే లోపే అనూహ్యంగా విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వ్యక్తిగత జీవితంలో ఫెయిల్యూర్.. నిర్మాతగా భారీ సక్సెస్..
విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు, నిందలు ఎదుర్కొన్న సమంత.. అటు అనారోగ్య సమస్యలతో కూడా సతమతమయ్యింది. మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) దర్శకత్వంలో వచ్చిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారి.. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, ‘ శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓటీటీ లో కూడా దూసుకుపోతోంది.
స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సమంత..
ఇదిలా ఉండగా తాజాగా సమంత స్టేజ్ పై ఎమోషనల్ అవుతూ.? మీరందరూ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారు అంటూ కామెంట్లు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల యూఎస్ లో జరిగిన TANA -2025 కాన్ఫరెన్స్లో పాల్గొన్న సమంత అక్కడ ఎమోషనల్ అయింది.” TANA గురించి ప్రతి ఏడాది వింటూనే ఉంటాను. నా మొదటి సినిమా మొదలుకొని ఇప్పటివరకు నన్ను తెలుగు ప్రజలు ఆదరిస్తూనే వచ్చారు. నన్ను నన్నుగా గుర్తించి నాకు గుర్తింపు ఇచ్చింది మీరే. నేను ఏ భాషలో సినిమా చేసినా.. ముందుగా తెలుగు ప్రజల గురించి, తెలుగు అభిమానుల గురించి ఆలోచిస్తాను. మీరు భౌగోళికంగా ఎంత దూరంగా ఉన్నా ఎప్పటికీ నా హృదయం ద్వారా నాకు చేరువలోనే ఉంటారు” అంటూ ఎమోషనల్ అవుతూ సమంత అభిమానులపై ప్రేమ కురిపించింది. ప్రస్తుతం సమంత ఎమోషనల్ కామెంట్స్ చూసి అభిమానులు తమపై ప్రేమ చూపిస్తున్న సమంత అభిమానానికి మురిసిపోతున్నారు.
రూమర్స్ తో సతమతమవుతున్న సమంత..
ఇకపోతే సమంత ఇప్పుడు కెరియర్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ అటు వ్యక్తిగతంగా రూమర్స్ తో సతమతమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో కాస్త చనువుగా కనిపించడంతో ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు అని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని, అందుకే రాజ్ భార్య శ్యామలి దే వీరి బంధాన్ని తప్పుపడుతూ పోస్టులు పెడుతుంది అంటూ పలు రకాల రూమర్లు సృష్టిస్తున్నారు. ఏది ఏమైనా సమంత మాత్రం ఇలాంటి రూమర్స్ తో మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Nargis Fakhri: ఆ టైమ్ లో నా ముఖం వికృతంగా మారుతుంది.. అసలు నిజం చెప్పిన బ్యూటీ!