itel City 100|బడ్జెట్‌కు తగిన స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రసిద్ధ బ్రాండ్ ఐటెల్. ఇప్పుడు భారత మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘సిటీ 100’. ఇంత తక్కువ ధరలో కూడా అన్ని ఫీచర్లతో ఈ ఫోన్ ఉండడం ఆశ్చర్యకరం. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. అంటే దుమ్ము, వాటర్ ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. భారతదేశంలోని మధ్యతరగతి మార్కెట్ కు సిటీ 100 ఫోన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ 7.65mm మందంతో సన్నగా, ఒకే డిజైన్‌లో రూపొందించబడింది. నావీ బ్లూ, ఫెయిరీ పర్పుల్, ప్యూర్ టైటానియం రంగుల్లో అందంగా కనిపిస్తుంది.
పర్‌ఫామెన్స్, డిస్‌ప్లే
సిటీ 100 ఫోన్‌లో యూనిసాక్ T7250 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉంది. ఇది 4GB ర్యామ్‌తో వస్తుంది. అదనంగా, వర్చువల్ ర్యామ్ ద్వారా దీనిని 12GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 128GB స్టోరేజ్ ఉంది. ఇది మీ ఫొటోలు, వీడియోలు, యాప్‌లను సులభంగా సేవ్ చేయడానికి సరిపోతుంది. ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్పష్టమైన, రంగురంగుల చిత్రాలను అందిస్తుంది.
బ్యాటరీ, AI ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5200mAh బ్యాటరీ ఉంది. ఇది రోజంతా ఉపయోగించడానికి తగినంత శక్తిని అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్‌లో ఐటెల్ సొంత ఎఐ టెక్నాలజీ అయిన కొత్త Aivana 3.0 AI అసిస్టెంట్ ఉంది. ఇది అనేక ఆసక్తికరమైన ఫీచర్లను అందిస్తుంది. ఉదాహరణకు.. ఫొటోల నుండి టెక్స్ట్ తీసుకోవడం, టెక్స్ట్‌ను సవరించడం, దాన్ని సారాంశంగా చేయడం, టోన్ మార్చడం, సందేశాల నుండి చిరునామాలకు నావిగేషన్ చేయడం, డాక్యుమెంట్ స్కానింగ్ వంటివి చేయవచ్చు.
కెమెరా, ఇతర ఫీచర్లు
సిటీ 100లో 13MP వెనుక కెమెరా మరియు 8MP ముందు కెమెరా ఉన్నాయి. ఇవి ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజేషన్‌తో అద్భుతమైన ఫొటోలను తీస్తాయి. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 60 నెలల పాటు సాఫీగా పనిచేసేలా టెస్ట్ చేయబడింది. దీర్ఘకాలం వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుంది.
ధర, ఆఫర్ల వివరాలు
ఐటెల్ సిటీ 100తో రూ.2,999 విలువైన ఉచిత మాగ్నెటిక్ స్పీకర్ కూడా వస్తుంది. అంతేకాక, 100 రోజులలోపు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా ఉంది. రూ. 8,000 కంటే తక్కువ ధరలో ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి కోసం ఐటెల్ సిటీ 100 ఒక బెస్ట్ ఆప్షన్.
Also Read: ఇక ఈ ఫోన్లలో గూగుల్ క్రోమ్ పనిచేయదు.. ఆగస్టు 2025 డెడ్ లైన్
ఎక్కడ కొనాలి?
ఐటెల్ సిటీ 100 ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర, డిజైన్, AI ఫీచర్లతో అందరి బడ్జెట్ లో సరిపోయే మంచి ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ ధృడత్వం, స్టైల్, అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లతో యువతను ఆకర్షిస్తుంది.