Nargis Fakhri:బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri) మోడల్ గా..హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంతో ఫేమస్. అలా మొట్ట మొదటిసారి సినిమాల్లోకి 2011లో రాక్ స్టార్(Rock Star) అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే అలాంటి నర్గీస్ ఫక్రీ తన అందచందాలతో బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు అందుకొని.. హీరోయిన్ గా దూసుకుపోతుంది. అయితే అలాంటి నర్గీస్ ఫక్రీ తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
పవన్ కళ్యాణ్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం..
కానీ మొట్టమొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు అనే సినిమాలో రోషనారా అనే పాత్రలో కనిపించబోతోంది.ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి నర్గీస్ ఫక్రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే అలాంటి నర్గీస్ ఫక్రీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సమయంలో నా ముఖం చాలా వికృతంగా మారుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రీ ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఏడాది రెండుసార్లు ఉపవాసం – నర్గీస్ ఫక్రీ
సినిమాలతో,వెబ్ సిరీస్ లతో ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న నర్గీస్ ఫక్రీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మొహం గురించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ.. “నేను ప్రతి సంవత్సరం రెండుసార్లు కచ్చితంగా ఉపవాసం ఉంటాను. అయితే ఆ ఉపవాసం చేసిన సమయంలో నా మొహంలో ఒక వింత మార్పు కనిపిస్తుంది. అదేంటంటే నేను ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉపవాసం ఉన్న సమయంలో 9 రోజులపాటు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తాను. అయితే అలా తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తున్నన్ని రోజులు ఫుడ్ ఏమీ తినకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగుతాను.
ఆ 9 రోజులు నా ముఖం వికృతంగా మారుతుంది – నర్గీస్ ఫక్రీ
అయితే ఈ ఉపవాసం అయిపోయేసరికి నా మొహంలో చాలా మార్పులు వస్తాయి. తొమ్మిది రోజులపాటు ఆహారం ఏమీ ముట్టుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతాను కాబట్టి నా మొహం చాలా వికృతంగా మారిపోతుంది. కానీ మొహంలో మాత్రం అంతకు ముందు లేని ఓ గ్లో కనిపిస్తుంది. అయితే తొమ్మిది రోజులు ఉపవాసం ముగించాక హై ప్రోటీన్స్ ఉండే ఫుడ్ ని తీసుకుంటాను.ఈ హై ప్రోటీన్స్ వుండే ఫుడ్ తినడం వల్ల మళ్ళీ నేను ఆరోగ్యంగా మారిపోతాను”..అంటూ నర్గీస్ ఫక్రీ చెప్పుకొచ్చింది.
నర్గీస్ ఫక్రీ సినిమాలు..
ఇక నర్గీస్ ఫక్రీ సినిమాల విషయానికి వస్తే..2011 నుండి బీటౌన్ లో యాక్టివ్ గా ఉంటున్న నర్గీస్ ఫక్రీ రాక్ స్టార్, మద్రాస్ కేఫ్(Madras Cafe),స్పై(Spy), కిక్(Kick),హౌస్ ఫుల్ 3(House Full-3), బాంజో(Banjo), టొర్భాజ్(Torbaaz) వంటి సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. ఇక నర్గీస్ ఫక్రీ చివరిగా నటించిన మూవీ హౌస్ ఫుల్ -5(House Full-5). ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.ఇక త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమా(Hari Hara Veeramallu Movie)లో రోషనారా (Roshanara) అనే పాత్రలో కనిపించబోతుంది. ఒకవేళ ఈ పాత్ర బాగుంటే సౌత్ లో నర్గీస్ ఫక్రీకి మరిన్ని ఛాన్సులు పెరిగే అవకాశం ఉంది.
ALSO READ:Tollywood: కృష్ణ మొదలు చిరు వరకు.. ఒకే ఏడాది అత్యధిక చిత్రాలు రిలీజ్ చేసిన హీరోలు వీరే!