Ram Charan: సినిమా ఇండస్ట్రీలో స్క్రిప్ట్ పూర్తయ్యాక పూజా కార్యక్రమాలు ముగించుకొని పట్టాలెక్కకుండా ఆగిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా క్లాప్స్ కొట్టిన రామ్ చరణ్ సినిమా కూడా ఆగిపోయిందని మీకు తెలుసా..? రామ్ చరణ్ కెరియర్ లో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా పట్టాలెక్కిన చిత్రం మెరుపు.ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎంతో అత్యుత్సాహంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టు ఇది. అలాంటి ఈ సినిమా కేవలం 15 రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. మరి సడన్గా ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన మెరుపు సినిమా ఆగిపోవడానికి రెండు ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి బడ్జెట్. మొదట అనుకున్న దానికంటే బడ్జెట్ హద్దులు మీరడం.. రెండవది అప్పటివరకు తీసిన అవుట్ పుట్ మెగాస్టార్ చిరంజీవిని ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అలా ఈ రెండు కారణాల వల్ల ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ ప్రాజెక్టుకి బ్రేకులు పడ్డాయి. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధరణి తెరకెక్కించాల్సిన ఈ స్పోర్ట్స్ డ్రామా 2010 ఏప్రిల్ 30వ తేదీన ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.ముఖ్యంగా మగధీర సినిమా తర్వాత మళ్లీ అదే కాంబోలో వచ్చిన ఈ సినిమా ఖచ్చితంగా మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందని అభిమానులు అనుకున్నారు
వాస్తవానికి రామ్ చరణ్ కి జోడిగా మగధీర బ్యూటీ కాజల్ ని ఇందులో తీసుకోవడం.. పైగా ధరణికి అప్పటికే కోలీవుడ్లో చాలా పెద్ద హిట్ లు ఉండడం.. మరొకవైపు తెలుగులో ఆయన చేసిన బంగారం సినిమా కూడా పర్లేదు అనిపించుకోవడం అన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి ఆర్. బి. చౌదరి తన సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందించాల్సిన సినిమా ఇది. తొలి షార్ట్ కు చిరంజీవి స్వయంగా క్లాప్ ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవి గతంలో నటించిన విజేత తరహాలోనే ఈ స్పోర్ట్స్ స్టోరీ ఉంటుందని.. చరణ్ కెరియర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. అందుకే ఓపెనింగ్ రోజు నుంచే ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండేవి.
మొదట ఈ సినిమా హీరోయిన్ విషయంలో కాస్త తలనొప్పి మొదలైంది ఆరెంజ్లో రామ్ చరణ్ కి జోడిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ షాజన్ పదంశీనీ హీరోయిన్గా అనుకున్నారు.. కానీ ఫోటోషూట్ రిజల్ట్ లో సరిగ్గా సెట్ కాకపోవడంతో మగధీర బ్యూటీ కాజల్ ను రంగంలోకి దింపారు. అప్పటికే సెట్ పైకి వెళ్లడం ఆలస్యం కావడంతో ఇతర సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక కాజల్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ స్థానంలో ఇలియానాను తీసుకున్నారు. హీరోయిన్ల సమస్య పక్కన పెడితే ముందుగా 35 కోట్ల రూపాయలతో తీయాలనుకున్నారు. దర్శకుడు అదనంగా మరో 10 కోట్లు పెంచాడు .
ALSO READ:చిత్రసీమలో విషాదం.. భరత్ కపూర్ మృతి వెనుక అసలు కారణం?
ఇక అదే సమయంలో ఆరెంజ్ విడుదలై డిజాస్టర్ కావడంతో రిస్కు తీసుకోలేకపోయారు నిర్మాత.. తన వల్ల కాదంటూ వెనక్కి తగ్గాడు . దాంతో చిరంజీవి రంగంలోకి దిగి ఒప్పించాడు చెన్నైలో 15 రోజులపాటు షూటింగ్ పూర్తి చేశారు. అది చిరంజీవికి చూపిస్తే ఆయన సంతృప్తి చెందలేకపోయారు. ఆ చిన్న షెడ్యూల్ కి సుమారుగా ఎనిమిది కోట్ల ఖర్చు అయింది. దీంతో స్క్రిప్టులో అవసరమైన మార్పులు చేయాలని చెప్పారు కానీ నిర్మాత ఈ సినిమాకి డబ్బులు పెట్టడం వృధా అని సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ ప్రాజెక్టును పట్టాలెక్కించారు తర్వాత చిరంజీవి ధరణిని పిలిపించి బడ్జెట్ పెరిగిందని ఇప్పటికే భారీ ఖర్చు అయిందని సినిమాను ఆపివేయాలని కోరడంతో అక్కడితో ఆ ప్రాజెక్టుకి పుల్ స్టాప్ పడింది. అలా చిరు చేతులు మీదుగా ప్రారంభమైన సినిమా 15 రోజులకే ఆగిపోయింది.