E-Paper
Advertisement

Renuka Chowdhury: ‘మొరిగే వాళ్లకు సమాధానం అక్కర్లేదు’.. జల వివాదంపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్..

Renuka Chowdhury: ‘మొరిగే వాళ్లకు సమాధానం అక్కర్లేదు’.. జల వివాదంపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్..
Advertisement

Renuka Chowdhury: కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల అంశం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (RLIS) చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మీడియాతో  మాట్లాడిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి , నదీ జలాల వివాదాలను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక బాధ్యతతో, సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. జల వివాదాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. “మొరిగే కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని” అంటూ వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వివాదాలను రాజేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Advertisement

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.  తానే స్వయంగా చంద్రబాబు నాయుడితో మాట్లాడి, తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపివేయించానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తనపై ఉన్న గౌరవంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాజెక్టు పనులు రేవంత్ చెప్పడం వల్ల ఆగలేదని, గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టడం వల్లే 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) మరియు కేంద్రం స్టే ఇచ్చాయని స్పష్టం చేసింది.

Advertisement

నీటి పంపకాల అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షాలు అధికార పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రికి తలొగ్గి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ఇది రాయలసీమకు ‘మరణశాసనం’ వంటిదని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఆరోపిస్తోంది. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని, కేఆర్ఎంబీ (KRMB) కి ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

వివాదాల పరిష్కారానికి కమిటీ

జల వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (MoJS) జనవరి 2, 2026న ఒక ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీలో కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (KWDT-2) గడువును కూడా కేంద్రం 31 జూలై, 2026 వరకు పొడిగించింది.

Read Also: Indiramma Indlu Scheme: ఇందిరమ్మ ఇండ్లపై మరో గుడ్ న్యూస్.. ఇకపై ప్రతి వారం నిధులు విడుదల

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×