BigTV English

Samantha Movie : ఉన్న ఆ ఒక్కటి కూడా ఆగిపోయింది… సమంతకు ఎవరైనా చేతబడి చేశారా ఏంటి?

Samantha Movie : ఉన్న ఆ ఒక్కటి కూడా ఆగిపోయింది… సమంతకు ఎవరైనా చేతబడి చేశారా ఏంటి?

Samantha Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు బోలెడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. నాగచైతన్యతో విడాకులు, అరుదైన వ్యాధి బారిన పడిన తర్వాత తెలుగు సినిమాలకు మెల్లగా దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలు వెబ్ సిరీస్లో చేస్తూ బిజీగా ఉన్న సమంత.. ఈమధ్య నిర్మాణ సంస్థను ప్రారంభించి తెలుగులో మొదటి సినిమాతో మంచి టాక్ ని సొంతం చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమె బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. అది ప్రస్తుతం ఆగిపోయినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. ..


బాలీవుడ్ సిరీస్ ఆగిపోవడానికి కారణం..?

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న హిందీ వెబ్‌సిరీస్ ‘రక్త బ్రహ్మాండ’ ఆగిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఎన్నో ఆశలతో సమంత చేసిన ఈ ప్రాజెక్ట్ నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ వెబ్ సిరీస్ ని పక్కన పెట్టేసినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాజ్ & డీకేతో కలిసి కొత్త ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌తో చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ పునఃప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఈ సిరీస్ పైన హీరోయిన్ సమంత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతమైతే ఈ సిరీస్ అటకెక్కినట్లు సమాచారం. భారీ కథనంతో వస్తున్నా ఈ సీరిస్ మళ్లీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో? ఎప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుందో? తెలియాల్సింది.


Also Read:అల్లు అర్జున్ – నీల్ కాంబోలో మూవీ..టైటిల్ కు విజిల్స్ పక్కా..

సమంత సినిమాల విషయానికొస్తే..

ఏం మాయ చేసావే అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది మలయాళ ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతోనే తన క్యూట్ లెస్ తో యూత్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా ఆమె దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ చేస్తూ వచ్చింది. సమంతగా నిర్మాతగా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా నిర్మించడంతో పాటు కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీలో ‘ రక్త బ్రహ్మాండ ’ అనే ఫాంటసీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా బాలీవుడ్‌లో పాగా వేసేయాలని పెద్ద ఆశలే పెట్టుకుంది సమంత. అయితే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.. మళ్లీ ప్రాజెక్ట్ మొదలుకావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అని ఈ మీటింగులో లెక్కలు తేల్చారట. ఏది ఏమైనా కూడా సమంత ఎన్నో ఆశలు పెట్టుకున్న సిరీస్ చేజారి పోవడంతో ఆమె అభిమానులు నిరాశనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తెలుగులో ఏ హీరోతో నటిస్తుందని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సమంత సినిమాలతో..  వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు సరే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

Related News

Sandeep Reddy Vanga: ఇక్కడికంటే అక్కడ సినిమా తీయడం చాలా ఈజీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానుల కష్టం ఇంకెవరికి రాకూడదు, ఎన్నిసార్లు అవే సినిమాలు

Lokesh Kanagaraj: ఆ ఒక్క ట్వీట్ కానీ వేస్తే, 1000 కోట్లు నడుచుకుంటూ వస్తాయి

Aamir Khan: ఈ డిమాండ్ ఏంటి సార్.. 15 నిమిషాల కోసం 20 కోట్లా?

Anupuma Parameswaran: ప్రమోషన్ కి మా దగ్గర డబ్బులు లేవు, రివ్యూ నచ్చితే సినిమా చూడండి

Annapurna Studios @ 50 years: అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. టాలీవుడ్‌ పునాది పడింది అప్పుడే.. ఇదీ ఏఎన్నార్ ఘనత

Big Stories

×