OTT Movie : ఒక కొరియన్ యాక్షన్ సిరీస్ ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఈ స్టోరీ సియోల్‌లోని క్రిమినల్ అండర్‌వరల్డ్‌లో జరిగే ఒక గ్రిట్టీ, రివెంజ్-డ్రైవన్ యాక్షన్ నోయిర్ డ్రామా. మతి పోగొట్టే యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ కొరియన్ యాక్షన్ నోయిర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘మెర్సీ ఫర్ నన్’ (Mercy for None). 2025 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు చోయ్ సుంగ్-యున్ దర్శకత్వం వహించారు. ఇందులో సో జి-సబ్, హహ్ జూన్-హో, అన్ కిల్-కాంగ్, లీ బియోమ్-సూ, గోంగ్ మ్యౌంగ్, చూ యంగ్-వూ, జో హాన్-చుల్, చా సియంగ్-వోన్ నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో 2025 జూన్ 6 నుంచి ఏడు ఎపిసోడ్‌లతో ప్రీమియర్ అయింది. ఈ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
నామ్ గి-జున్ , ఒకప్పుడు బోంగ్సాన్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు, జూవూన్ గ్రూప్‌లో టాప్ ఎన్‌ఫోర్సర్‌గా పనిచేసిన వ్యక్తి. గి-జున్ తన హింసాత్మక గతాన్ని వదిలేసి, 11 సంవత్సరాల క్రితం తన సోదరుడు నామ్ గి-సియోక్ ను రక్షించడానికి, యాకుజా గ్యాంగ్‌తో శాంతి కుదుర్చుకుని సియోల్‌ను విడిచిపెట్టాడు. ఇప్పుడు అతను ఒక మారుమూల క్యాంప్‌గ్రౌండ్‌ను నడుపుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక రోజు గి-జున్‌కు తన సోదరుడు గి-సియోక్ హత్యకు గురైన వార్త తెలుస్తుంది. గి-సియోక్, జూవూన్ గ్రూప్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటూ, లీ జూ-వూన్ నాయకత్వంలోని గ్యాంగ్‌కు మార్గదర్శకుడిగా ఉంటాడు. అతని హత్య సియోల్‌లోని రెండు ప్రధాన గ్యాంగ్‌లు—జూవూన్ గ్రూప్, గూ బోంగ్-సాన్ నాయకత్వంలోని బోంగ్సాన్ గ్రూప్ మధ్య ఉద్రిక్తతలను పెంచుతుంది. ఈ రెండు గ్యాంగ్‌లు ఒకప్పుడు ఓహ్ నాయకత్వంలో భాగంగా ఉండేవి. కానీ ఓహ్ మరణం తర్వాత, లీ జూ-వూన్, గూ బోంగ్-సాన్ విడిపోయి, సియోల్‌లోని క్రిమినల్ టెరిటరీలను విభజించుకున్నారు.
ఇప్పుడు గి-జున్ తన సోదరుడి హత్య వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానకి సియోల్‌కు తిరిగి వస్తాడు. ఇది అతన్ని మళ్లీ హింసాత్మక అండర్‌వరల్డ్‌లోకి వెళ్ళేటట్టు చేస్తుంది. అతను తన పాత సహచరులైన లీ జూ-వూన్, గూ బోంగ్-సాన్ ఎదుర్కొంటాడు.దర్యాప్తు సాగుతున్న కొద్దీ, గి-సియోక్ హత్య వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది. ఇందులో గ్యాంగ్ వార్‌లు, రియల్ ఎస్టేట్ మాఫియా, అవినీతిపరమైన రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి. ఈ క్రమంలో అనేక ట్విస్టులు, యాక్షన్ సీన్స్ తో స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. చివరికి తన సోదరుడి హత్యకు గి-జున్ రివేంజ్ తీర్చుకుంటాడా ? అతన్ని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ టెలివిజన్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : రాత్రిపూట గోర్లు కట్ చేసుకుంటే ఈ దెయ్యానికి బలి… చలికాలంలో కూడా చెమటలు పట్టించే హర్రర్ మూవీ