E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్ ఆశలు గల్లంతు… ఇదే చిట్టచివరి ఛాన్స్!

BRS : బీఆర్ఎస్ ఆశలు గల్లంతు… ఇదే చిట్టచివరి ఛాన్స్!
Advertisement

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా భావించారు. కానీ, అనుకోకుండా ఈసారి కూడా గులాబీ పార్టీకి వ్యతిరేకంగానే తీర్పు రావడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని.. కావాలనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి క్లీన్ చిట్ ఇస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్, రాహుల్ గాంధీ రాజ్యంగం నడుస్తున్నదని.. భారత రాజ్యాంగాన్ని వీరిద్దరూ అపహాస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.

అప్పుడు ఐదుగురు..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ చేపట్టారు. క్రాస్ ఎంక్వయిరీ సైతం జరిపారు. చివరగా ఎమ్మెల్యేల అఫిడవిట్, అందులో వారు పేర్కొన్న స్టేట్మెంట్ ఆధారంగా అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులకు ముందుగా క్లిన్ చిట్ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని.. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్యేలు సైతం స్పష్టం చేయడంతో ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నిన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు.

ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..

Advertisement

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ముందుగా అఫిడవిట్ సమర్పించారు. అందులో తాము పార్టీ మారలేదని, తామింకా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం స్పీకర్ పోచారం, కాలేయాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చి.. వారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. గులాబీ పార్టీలోనే ఉన్నారని ప్రకటన విడుదల చేశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. స్పీకర్ కావాలనే పక్షపాతం వహిస్తున్నారని.. ఫైర్ అవుతున్నారు. మొత్తం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వగా.. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

Advertisement

AP vs Telangana : రేవంత్ చంద్రబాబు.. జగన్ కేసీఆర్.. ఇదేం రాజకీయం!

తాజాగా బీఆర్ఎస్ మరోసారి సుప్రీం తలుపుతట్టగా స్పీకర్ ఆలస్యం చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని లేదంటే తామే చివరి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం మండిపడింది.అయితే, తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరగా కోర్టు అందుకు ఒప్పుకోలేదని తెలిసింది. స్పీకర్ ఈ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయని.. అందులో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావించింది. కానీ, ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే చాన్స్ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది చిట్టచివరి చాన్స్.. మిగతా ముగ్గురి విషయంలో కేవలం దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చని తెలుస్తున్నది. లేదా తనే రాజీనామా చేస్తారని టాక్ వినిపిస్తున్నది. మిగిలిన ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. దానం రాజీనామా ఎందుకంటే ఆయన కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా గెలుపొందడంతో ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు బైపోల్ తప్పదని తెలుస్తున్నది. మరి ఈ స్థానంలో బీఆర్ఎస్ గెలుస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించనుంది.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×