Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha ) ఎట్టకేలకు డెలివరీకి సిద్ధమయింది. ఈ క్రమంలోనే ఈమె అత్తగారింటి కుటుంబ సభ్యులు ఈమెను ప్రత్యేకంగా కలశం ముందు కూర్చోబెట్టి.. పూజలు నిర్వహించి మరీ సీమంతం వేడుకలను నిర్వహించారు. అయితే ఇలా సీమంతం వేడుకలలో కలశం ఉపయోగించడం వెనక అసలు కారణం ఏంటి? అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. పైగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి . అయితే సమంతకు జరిగిన వేడుక ఏంటి ? అది సీమంతం వేడుక ?లేక మరేదైనా? అనే ప్రశ్న వైరల్ గా మారుతున్న నేపథ్యంలో రాజ్ సోదరి శీతల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా సమంతకు జరిగిన వేడుక ఇదే అంటూ క్లారిటీ ఇచ్చారు.
రాజ్ నిడిమోరు సోదరి శీతల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా సమంతకు జరిగిన వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ విధంగా పంచుకుంది.” సమంతకి కుటుంబ సాంప్రదాయం ప్రకారం.. మాతృ శిశు మంగళ ఆశీర్వాదం వేడుకను ఘనంగా నిర్వహించాము. ఈ వేడుకలో భాగంగా శ్రీ సూక్తం, గాయత్రీ దేవి హోమం నిర్వహించడంతోపాటు 21సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాము. ఈ సందర్భంగా శోభా రాజు సమంతా కోసం ప్రత్యేకంగా ఒక పాటను కూడా రూపొందించారు. కుటుంబంలోని పెద్దలంతా కలిసి సమంతను పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ భావోద్వేగంగా ఆమె పేర్కొన్నారు. మొత్తానికైతే సమంతకు జరిగిన ఈ వేడుకపై శీతల్ స్పందించి క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సమంతకు ఇటీవల మరో పద్ధతిలో సీమంతం వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఇకపోతే సమంత సెప్టెంబర్ నెలలో శ్రీ విద్యా సాంప్రదాయం నుండి ప్రత్యేకమైన ఆచారంగా చెప్పబడే శ్రీ కల్పం పద్ధతిలో సాంప్రదాయ సీమంతం వేడుకలను జరుపుకున్నారు. కాబోయే తల్లిని అమ్మవారిగా గౌరవిస్తూ ప్రతి మంత్రానికి ,నైవేద్యానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉందని సమంత చెప్పుకొచ్చారు. ఆమె స్నేహితురాలు, డిజైనర్ శిల్పారెడ్డి ఈ వేడుకను ఈ దంపతులకు ప్రత్యేకంగా నిర్వహించారు.
also read:గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న టాప్ కంటెస్టెంట్.. ఎవరంటే?
ఇకపోతే సమంత , రాజ్ నిడిమోరు విషయానికొస్తే.. వీరిద్దరూ డిసెంబర్ 1 2025న కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్లో లింగ బైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక డిసెంబర్ 2026లో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఏది ఏమైనా వివాహం జరిగిన ఏడాది తర్వాత సమంత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు పుట్టబోయే బిడ్డ , ఆమె ఇద్దరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలి అని కోరుతూ ప్రత్యేకంగా ఈ పూజలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సమంతకు జరుగుతున్న ఈ సీమంతపు వేడుకల తాలూకా విశేషాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
?utm_source=ig_web_copy_link&cnvx=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==