E-Paper
Advertisement

Sandeep Reddy Vanga: గుడ్ న్యూస్.. విజయ్ ముందు స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి

Sandeep Reddy Vanga: గుడ్ న్యూస్.. విజయ్ ముందు స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి

Sandeep Reddy Vanga: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అన్నిటిని మించి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు. అని ఒక కొత్త దారిని వేసి చూపించాడు. ఎన్నో వివాదాలతో మొదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ సినిమా తర్వాత డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఆఫర్ కొట్టేసాడు. బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ సినిమాతో షేక్ చేశాడు సందీప్.

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ 

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే చాలామందికి క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు అని రివిల్ చేసి ఒక మంచి హై ఇచ్చాడు సందీప్. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఉండవలసిన కటౌట్ అన్ని కూడా పుష్కలంగా ప్రభాస్ కు ఉంటాయి. కానీ ఎవరు ప్రభాస్ లో ఆ యాంగిల్ పర్ఫెక్ట్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. ఈ సినిమా గురించి అప్డేట్ ఏమీ రావట్లేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్న తరుణంలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి. కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగ ఒక పాడ్ కాస్ట్ చేశారు. ఈ పాడ్ కాస్ట్ లో విజయ్ మాట్లాడుతూ… నిన్ను ఇక్కడ పెట్టుకొని స్పిరిట్ సినిమా అప్డేట్ అడగకపోతే ఆడియన్స్ విడిచిపెట్టారు అన్నాడు. అయితే స్పిరిట్ సినిమా సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతున్నట్లు తెలిపాడు. ఏమైనా లీక్ ఇవ్వచ్చు కదా అంటే, నీకేమీ లేదు సెప్టెంబర్ ఎండ్ లో స్టార్ట్ అవుతుంది. అన్నాడు సందీప్ రెడ్డి, కంటిన్యూస్ గా షూట్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్ లో రాజా సాబ్ 

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ప్రజెంట్ చేయనున్నాడు మారుతి. ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి సినిమాల్లో ప్రభాస్ తన టైమింగ్ తో విపరీతంగా ఆకట్టుకున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు అటువంటి పాత్రలు పడలేదు. బహుశా మారుతి స్ట్రెంత్ కూడా కామెడీ కాబట్టి ఈసారి ప్రభాస్ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను చూడబోతున్నాం.

Also Read: Vijay Devarakonda : దేవుడా ఒక్క హిట్ సినిమా ఇవ్వు, జై శ్రీరామ్ అంటున్న విజయ్

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×