Priyanka Jain : ప్రియాంక జైన్, శివ కుమార్… బుల్లితెరపై ఎంతో క్యూట్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పేశారు కూడా .ఇక తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన ఒక హాట్ రీల్ వల్ల మరోసారి వార్తల్లో నిలిచారు.
టాక్సిక్ సినిమాలోని ‘తబాహీ’ పాటకు
విషయంలోకి వెళ్తే ..తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న టాక్సిక్ సినిమాలోని ‘తబాహీ’ పాటకు ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ వీడియో చేశారు. ఆ వీడియోను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ రావడం విశేషం. అంతేకాదు కామెంట్లు, లైక్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.
అయితే ఈ వీడియోలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది ప్రియాంక జైన్ లుక్. సీరియల్స్‌లో ఎప్పుడూ చీరలు, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కనిపించే ప్రియాంక… ఈసారి మాత్రం బికినీ లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు నెటిజన్లు. ” టాక్సిక్ లో పాట ఏ రేంజ్ లో ఉందో వీడియో కూడా అదే రేంజ్‌లో ఉంది గా” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే… “ఇద్దరూ నిజంగానే టాక్సిక్ మూడ్‌లోకి వెళ్లిపోయారా?” అంటూ మరికొందరు సరదాగా రియాక్ట్ అవుతున్నారు.
సీరియల్స్‌లో అవకాశాలు కొంచెం తగ్గాయేమో
మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం “ఈ మధ్య సీరియల్స్‌లో అవకాశాలు కొంచెం తగ్గాయేమో… అందుకే సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయాలని చూస్తుంది?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కామెంట్లకు ప్రియాంక అభిమానులు ‘నటి ట్రెడిషనల్‌గా మాత్రమే కనిపించాలనే రూల్ ఏమీ లేదని, సోషల్ మీడియాలో ట్రెండ్‌కు తగ్గట్టుగా వీడియోలు చేయడంలో తప్పేముందని కౌంటర్ వేస్తున్నారు.
‘మౌనరాగం’ సీరియల్‌తో మంచి గుర్తింపు
ప్రియాంక జైన్ విషయానికి వస్తే ‘మౌనరాగం’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. తన అమాయకమైన నటన, ఎమోషనల్ సీన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మరోవైపు శివ కుమార్ కూడా పలు టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయనకు కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది కూడా.
ఇక ఇద్దరూ కలిసి టీవీ ఈవెంట్స్, రియాలిటీ షోలలో , పాల్గొనడం వల్ల వీరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా తమ ప్రేమను పలు స్టేజెస్ పై ఓపెన్ గానే చెప్పేశారు కూడా. దీంతో వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ ఇద్దరు కలిసి పుట్టినరోజులు, వెకేషన్స్, ఫ్యామిలీ సెలబ్రేషన్స్… ఇలా ప్రతి ప్రత్యేక సందర్భాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అందుకే వీళ్లు ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతోంది.ఇక బిగ్ బాస్ 7 సీజన్ లో హౌస్ లో ఎంత రచ్చ చేశారో ప్రత్యక్షంగా చూశాం కూడా .
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
తాజాగా విడుదల చేసిన ‘తబాహీ’ వీడియో కూడా ఇప్పుడు అదే స్థాయిలో వైరల్ అవుతోంది. ఒకవైపు ఇద్దరి కెమిస్ట్రీని చూసి అభిమానులు ఫిదా అవుతుంటే, మరోవైపు ప్రియాంక గ్లామర్ లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నెగెటివ్ కామెంట్లు వచ్చినా, పాజిటివ్ కామెంట్లు వచ్చినా… మొత్తానికి ఈ వీడియోతో ప్రియాంక జైన్, శివ కుమార్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారనే చెప్పాలి.
also read :“మై బ్రదర్” అంటూ దుల్కర్‌పై ప్రేమ కురిపించిన ఎన్టీఆర్..!