Telugu TV Serials TRP Ratings : తెలుగు టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త ప్రోగ్రాంలతో పాటుగా సరికొత్త కథలతో సీరియల్స్ నీ ప్రసారం చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో రెండు వేలకు పైగా ఎపిసోడ్లు కూడా పూర్తవుతుంటాయి.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రతి సీరియల్ కూడా గట్టి పోటీతో టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు వెనకడుగు వేసిన సీరియల్స్ సైతం ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఆమధ్య వంటలక్క కార్తీకదీపం 2 సీరియల్ రేటింగ్ లో కింగ్ లాగా ఉండేది. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ టాప్ లోనే కొనసాగుతుంది. మరి గత వారంతో పోలిస్తే ఈ వారం టాప్ లోకి గుండెనిండా గుడిగంటలు సీరియల్ వచ్చేసిందని తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ సీరియల్ రేటింగు ఎంత ఉందో ఒక్కసారి చూసేద్దాం…
తెలుగు టీవీ సీరియల్స్ రీసెంట్ హిస్టరీ చూస్తే నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం 2. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఇదే. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 13.08 రేటింగ్ తో దూసుపోతుంది.
స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ మధ్య కొద్ది రోజులు డల్ అయినా సరే మళ్లీ స్పీడును పెంచేసుకుంది. కార్తీకదీపం తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 12.54 రేటింగ్ నమోదైంది.
స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో తెచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం టాప్ సీరియస్లలో ఈ సీరియల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. దీని రేటింగ్ విషయానికి వస్తే .. 13.18 ఉంది.
స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 11.17 రేటింగ్ వచ్చింది.. అందరు కలిసి పోవడంతో రేటింగ్ కూడా బాగా పెరిగింది..
గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ కాస్త పస తగ్గడంతో రేటింగ్ పడిపోయిందని టాక్ వినిపిస్తుంది. బాలు మీనాలపై సెటైర్లు అలాగే రోహిణి మనోజ్ లు చేస్తున్న హంగామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అదే విధంగా.. నిన్ను కోరి సీరియల్ కూడా క్రమంగా పైకి వస్తోంది. తాజా రేటింగ్స్ లో 8.23తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.17 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.15తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. త్రినయని సీరియల్ ఎప్పటికీ టాప్ లోనే ఉంది..