Actor Satish Shah Died: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సతిష్ షా (74) తాజాగా కన్నుమూశారు. బాలీవుడ్ సినీ, టీవీ ఇండస్ట్రీ ఎంతో గుర్తింపు పొందిన సతీష్ షా శనివారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన అరోగ్యం విషమించడంతో కాసేపటి క్రితం మరణించారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ మీడియాకు ప్రకటించారు.
ప్రస్తుతం సతీష్ షా భౌతికాయం ఆస్పత్రిలోనే ఉందని, అన్ని పార్మిలిటిస్ పూర్తయ్యాక రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆయన మృతితో హిందీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం బాలీవుడ్ సినీ,టీవీ నటీనటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మరికొందరు నటులు ఆస్పత్రికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. దాదాపు 4 దశాబ్ధాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో సతీష్ షా స్టార్ నటుడిగా రాణిస్తున్నారు.
Also Read: Bigg Boss 9 Elimination: ఈ వారం పచ్చళ్ల పాప రమ్య అవుట్.. డేంజర్లో జోన్ ఉంది వీరే!
వందల చిత్రాల్లో నటించిన విభిన్న పాత్రలతో వెండితెరపై అలరించారు. ముఖ్యంగా ఆయన కామెడీ పాత్రలు ఆడియన్స్ని బాగా ఆకట్టున్నాయి. షారుక్ ఖాన్, కాజోల్ బ్లాక్బస్టర్ చిత్రం ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ చిత్రంలో కీ పాత్ర పోషించారు. ‘హమ్ సాత్-సాత్ హైన్’, ‘మై హున్ నా’, ‘ కల్ హో నా’, ‘కభీ హాన్ కబీ నా’, ‘ఓం శాంతి ఓం’ చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు పొందారు. అలాగే టెలివిజన్ రంగంలోనూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ‘సారాబాయ్ వర్సెస్ సారాబాయ్’ పాపుల్ కామెడీ షో నటించి తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ షో టెలివిజన్ హిస్టరీలోనే మోస్ట్ ఐకానిక్ టీవీ షోకి ఇది నిలిచింది. ఇందులో ప్రతి పాత్ర కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ బుల్లితెర ఆడియన్స్ని ఆకట్టున్నాయి. అందులో సతీష్ షా పాత్ర కూడా ఒకటి.