E-Paper
Advertisement

ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్.. 48 గంటల్లోనే ఆ మూవీ బ్యాన్!

ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్.. 48 గంటల్లోనే ఆ మూవీ బ్యాన్!
Advertisement

Satluj Movie: ‘‘సట్లెజ్’  …దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది .నాలుగేళ్ల పాటు సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలని, కోర్టు వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకి జులై మూడున ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ Zee5 లో  సైలెంట్ గా  స్ట్రిమింగ్ కి వచ్చింది.అయితే వచ్చిన  48 గంటల్లోనే   ఇండియాలో బ్యాన్ అయిపోయింది ఈసినిమా .

ఒక రకంగా ఇండియన్ డిజిటల్ స్ట్రీమింగ్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఒక సినిమాని ప్లాట్ ఫామ్  నుంచి తొలగించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న పొలిటికల్ సోషల్ బ్యాక్ గ్రౌండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారాన్ని లేపుతుంది.నిజానికి ఈ కాంట్రవర్సీకి మెయిన్ రీజన్ సినిమా ఎంచుకున్న స్టోరీ .

Advertisement

వేలాదిమంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను

1984 నుండి 94 మధ్యకాలంలో పంజాబ్లో జరిగిన తీవ్రవాద అణిచివేతల నేపథ్యంలో  వేలాదిమంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ దారుణ నిజాలను బయటపెట్టి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లిన మానవ హక్కుల ఉద్యమకారుడు జశ్వంత్ సింగ్ కల్రా నిజజీవిత ఆధారంగా డైరెక్టర్ హనీ డెహ్రాన్ ఈ సినిమాని తెరకెక్కించాడు .1990లో ఖల్రా కూడా రహస్యంగా అదృశ్యమై ఆ తర్వాత హత్యకు గురైనట్లు తేలడం పంచాయతీ చరిత్రలోనే ఒక బ్లాక్ చాప్టర్ .

Advertisement

ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ ని టచ్ చేయడంతోనే ఈ సినిమా మొదటి నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది .వాస్తవానికి ఈ సినిమా జర్నీ అంత ఈజీగా సాగలేదు .మొదట ఈ సినిమాకి ‘ఘల్లుఘారా’ (Ghallughara)అనే హిస్టారికల్ టైటిల్ ని పెట్టారు మేకర్స్ .అయితే దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో పాటు 21 కట్స్  విధించింది.

ఆడియన్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని హింట్

దీంతో మేకర్స్  కోర్ట్ మెట్లు ఎక్కడంతో  టైటిల్ పంజాబ్ 95 గా మార్చారు.20 23లో ద ఫేమస్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాని ప్రీమియర్ వేయాల్సినప్పటికీ అనేక పొలిటికల్ ప్రెజర్స్ వల్ల   చివరి నిమిషాల్లో సినిమా స్క్రీనింగ్ రద్దు చేశారు.ఇలా థియేటర్లో  రిలీజ్ దాదాపు అసాధ్యం కావడంతో ఇక ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ గా అన్ కట్ వెర్షన్ ని Zee5 లోవదిలారు మేకర్స్ అయితే సినిమా రిలీజ్ సమయంలోనే దీనిపై బ్యాన్ చేసే అవకాశం ఉందని హీరో దిల్జీత్ దోసాంజ్ ముందే ఊహించారు. జులై 3న ఆయన ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి సోమవారానికల్లా జూలై 6 20 26 కల్లా ఈ సినిమాను తీసేసి ప్రమాదం ఉందని కాబట్టి ఆడియన్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని హింట్ కూడా ఇచ్చాడు .అయితే ఆయన భయపడినట్టుగానే ఆదివారం  Zee5 ఇండియాలో లింకులు నిలిపివేసింది.

ఇక ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఇక్కడ స్ట్రీమింగ్  కష్టమని అయితే విదేశాల్లో ఉండే Zee5 గ్లోబల్ ద్వారా అందుబాటులో ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది Zee5. దిల్జీత్ పంజాబీ లో ఎమోషన్ అవుతూ చేసే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారాయి .నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా, చనిపోయే వరకు తాను పంజాబ్ హకుల కోసమే పోరాడుతానని కుండబద్దలు కొట్టేశాడు.ఇక సినిమా ఇప్పటికి ఇంటర్నెట్లోకి వచ్చేసిందని,  డౌన్ లోడ్ చేసుకొని అయినా సరే ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరాడు.జస్వంత్ సింగ్ కల్రా చేసిన త్యాగం గురించి  దేశంలోని ప్రతి ఇంట్లో చర్చి జరగాలని తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.

గతంలో పంజాబ్లో నేపథ్యంలో వచ్చిన పంజాబ్ 1984,  ఉడ్తా పంజాబ్’వంటి సినిమాలు ఇలాంటి కాంట్రవర్సీలనే ఫేస్ చేసినప్పటికీ ‘‘సట్లెజ్ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ 48 గంటల హైడ్రామా మాత్రం  సినీ ఇండస్ట్రీలో ఒక రికార్డు అని చెప్పాలి.

Related News

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×