Vaibhav Sooryavanshi Gets Injured: ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (England vs. Team India) మధ్య ప్రస్తుతం t20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా… మొన్న జరిగిన టి20లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) చెత్త ప్రదర్శన నేపథ్యంలో… రెండో టి20 లో టీం ఇండియా ఓడిపోయింది.
ఇంగ్లాండ్ చేతిలో రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఓటమి చెందిన టీమిండియా జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ Vaibhav Sooryavanshi ) తీవ్రంగా గాయపడ్డాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా, వైభవ్ సూర్య వంశీ పొత్తి కడుపులో తీవ్రమైన గాయమైంది. ట్రైనర్ బలంగా బంతి విసిరిన నేపథ్యంలో… బ్యాటింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Gets Injured) కడుపులో వేగంగా వచ్చి తగిలేసింది బంతి. దీంతో విలవిలలాడిపోయి వైభవ్ సూర్యవంశీ కింద పడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వైభవ్ సూర్యవంశీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడిన తొలి మ్యాచ్ కే గాయం బారిన పడ్డాడని ఎమోషనల్ అవుతున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. మంగళవారం రోజున టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పురుషుల జట్ల మధ్య ఫైట్ జనరల్ ఉంది. ఈ మ్యాచ్ నాటింగం (Trent Bridge, Nottingham) వేదికగా జరగనుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా రాత్రి పది గంటల సమయంలో షురూ అవుతుంది. ఇలాంటి తరుణంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రెండు టి20 సందర్భంగా బరిలోకి దిగిన వైభవ్ సూర్య వంశీ.. కేవలం రెండు సిక్సర్లు మాత్రమే కొట్టి నిరాశపరిచాడు. ఈ క్రమంలో మూడవ టి20 లో అయినా అతనికి బ్యాటింగ్ ఇస్తారని… అతని బ్యాటింగ్ చూడాలని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అతనికి గాయం చోటు చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, శ్రీలంకపై అద్భుతమైన వైభవ్ సూర్య వంశీకి తిరుగు ప్రయాణం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాటింగం వేదికగా ప్రాక్టీస్ చేస్తుండగా వైభవ్ సూర్య వంశీ కడుపులో చిన్నపాటి గాయమైంది. బంతి నేరుగా పొత్తికడుపున తగలడంతో… విలవిలలాడేసాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయలేక ఆసుపత్రికి కూడా వెళ్లాడట వైభవ్. ఈ క్రమంలో అతడు మూడవ టి20కి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇంగ్లాండులో ఉన్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని ఇంటికి పంపించేందుకు సిద్ధం అవుతున్నారట. జింబాబ్వే తో టూర్ లో ఫైనల్ గా వైభవ్ పేరు రావడంతో… అతని ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ కడుపులో గాయం కావడం హాట్ టాపిక్ అయింది. ఈ గాయం తగిలిన నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని నేరుగా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు పంపిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితులలో అతడు ఇంటి దగ్గర ఉంటేనే బెటర్ అని బీసీసీఐ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది