Arabia Kadali : చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన తండేల్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బుజ్జి తల్లి అనే పాటతో ఆ సినిమా మీద విపరీతమైన హైప్ వచ్చింది. సినిమాలో కూడా ఆ పాట కీలకపాత్రను పోషించింది. చాలాసార్లు ఆ ట్యూన్ వినిపిస్తూనే ఉంటుంది.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ కూడా నమోదు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ఆ సినిమా విషయంలో చాలామందికి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాస్తవాలను తప్పుపట్టారు అంటూ కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారు. సినిమా కథ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో అది ఒక సంచలమైన విషయం.
అదే కథను క్రిష్ రాశాడు
శ్రీకాకుళం కు చెందిన కొందరు మత్స్యకారులు. వేట కోసం వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ వాళ్ళ బార్డర్ లోకి వెళ్లి పోతారు. అక్కడ పాకిస్తాన్ వాళ్లకి దొరికిపోతారు. అక్కడ వాళ్లు ఎన్ని చిత్రహింసలు పట్టుకున్న తర్వాత మళ్లీ భారతదేశానికి వచ్చారు అనేది చిత్రకథ. ఈ కథను కార్తీక్ తీడా ఒక పేపర్ లో చూసి రాశాడు. సినిమా విడుదలైన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. వాళ్ళు బయటికి రావడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ కొంతమంది వాదించారు. రాజకీయాలకు సంబంధం లేదు అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి అదే కథను సత్యదేవ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి రాశారు. దీనికి అరేబియన్ కడలి అనే టైటిల్ పెట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8 నుంచి ఇది స్ట్రీమింగ్ కి రానుంది.
సత్యదేవ్ సరసన ఆనంది
తండేల్ సినిమాలో సాయి పల్లవి నటించింది. మొదట నాగచైతన్య వాయిస్ ఓవర్ లో వచ్చిన బుజ్జి తల్లి అనే మాట బాగా పాపులర్ అయిపోయింది. అయితే అదే మాదిరిగా ఈ సినిమాలో బుజ్జి తల్లి కాకుండా ఆనంది క్యారెక్టర్ కు గంగ అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో ఆనంది ఉత్తరాంధ్ర యాసను మాట్లాడుతుంది. మరోవైపు ఆ ప్రేమను కూడా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే తండాల సినిమాకి సంబంధించిన దాఖలాలు చాలా కనిపిస్తున్నాయి. వెబ్ సిరీస్ అంటే లైట్ తీసుకోకుండా, చాలా రిచ్ గా దీనిని ప్లాన్ చేశారు. దీనికి ఓటిటిలో ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో ఆగస్టు 8 నుంచి తెలుస్తుంది. క్రిష్ జాగర్లమూడి కేవలం దీనికి రచయిత మాత్రమే. ట్రైలర్ అయితే మాత్రం ఫైనల్ గా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.
Also Read: Suriya: రాంగ్ టైమింగ్ సూర్య.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించిన హీరో