Ind vs Eng 5th Test: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఐదవ టెస్ట్ లోని రెండవ రోజు భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. చివరి టేస్ట్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండవ రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. రెండవ రోజు కేవలం 20 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది భారత జట్టు.
Also Read: CSK: CSKలోకి ఇద్దరు టీమిండియా వికెట్ కీపర్లు.. ఇక 2026లో రచ్చ రచ్చే..!
దీంతో ఐదవ టెస్ట్ లోని తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత జట్టులో చివరి ముగ్గురు బ్యాటర్లు ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ డకౌట్ అయ్యారు. రెండవ రోజు 52 పరుగుల వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన కరుణ్ నాయర్.. మరో అయిదు పరుగులు మాత్రమే చేసి జోస్ టంగ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా వెనుదిగాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు చేసి.. అట్కిన్సన్ బౌలింగ్ లో జేమి ఓవర్టన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇక జోస్ టంగ్ 3, క్రిష్ వోక్స్ 1 వికెట్లు తీశారు.
రెండవ రోజు ఆటలో అట్కిన్సన్ విజృంభించాడు. చివరి 4 వికెట్లలో మూడు వికెట్లు.. {వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ} వికెట్లను పడగొట్టాడు. ఇక చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీ తో రాణించిన కరుణ్ నాయర్ ని.. జోస్ టంగ్ బోల్తా కొట్టించాడు. భారత ఇన్నింగ్స్ లో యశస్వి జైష్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, దృవ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్ 0 పరుగులు చేశారు. ఇక ఐదు టెస్టు మ్యాచ్ ల ఈ సిరీస్ లో భారత్ 1 – 2 తో ఇప్పటికే వెనకబడిన విషయం తెలిసిందే.
Also Read: Gambhir on Jadeja: ఒరేయ్ నీకు బుద్ధి ఉందా…. జడేజా పై గౌతమ్ గంభీర్ సీరియస్
ఇక ఈ ఐదవ టెస్ట్ ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఈ మైదానం బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఇటీవల ఈ మైదానంలో జరిగిన కౌంటి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 1500 కు పైగా పరుగులు నమోదు అయ్యాయి. కానీ ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 343 పరుగులు మాత్రమే. అయితే మ్యాచ్ సందర్భంగా వర్షం పడితే మాత్రం పిచ్ స్పందించే తీరులో మార్పులు రావచ్చని ముందే తెలిపారు. సరిగ్గా ఇలాగే భారత్ బ్యాటింగ్ చేస్తున్న తొలి రోజు వర్షం పలుసార్లు ఆటంకం కలిగించింది. వర్షం ఆటంకం కారణంగానే భారత బ్యాటర్ల పై ఇంగ్లాండ్ బౌలర్లు ఒత్తిడి పెంచి వికెట్లు సాధించగలిగారని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. వర్షం కారణంగా వరుస విరామ సమయాలలో స్టేడియం పచ్చిగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ బౌలర్లకు పిచ్ అనుకూలంగా మారింది అంటున్నారు. ఇక రెండవ రోజు ఆట భారత బౌలర్ల పైనే ఆధారపడి ఉంది.