E-Paper
Advertisement

కేద్రంలో బీజేపీ పతనం మొదలైది.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక!

కేద్రంలో బీజేపీ పతనం మొదలైది.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక!
Advertisement

Uttam Remarks: ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన కేంద్రపై విరుచుకుపడ్డారు. యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరు.. రాజ్యాంగాన్ని అణచలేరు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్బంధాలు సరికాదని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు అడిగిన యువతకు లాఠీలు, కేసులతో బీజేపీ సమాధానమా అని విమర్శించారు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కేనిని అన్నారు.

కేంద్రం నిర్లక్ష్యం..

విద్యార్థుల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని, యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. విద్యార్థుల మధ్య నిలిచిన రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడని, ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుందని వ్యాఖ్యానించారు. భయపెట్టి ప్రజల స్వరాన్ని శాశ్వతంగా అణచలేరని, విద్యార్థుల కలలను సంకెళ్లతో బంధించలేరని స్పష్టం చేశారు. యువత ఆశయాలను జైళ్ల గోడల మధ్య నిర్బంధించలేరని, రాజ్యాంగాన్ని ఎవరూ ఓడించలేరని, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ చారిత్రక బాధ్యత వహిస్తుందన్నారు.

Advertisement

Also Read: ట్రావెల్ చేసేవారికి జాక్‌పాట్! రూ.1,100 లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ ఇదే బాస్

రాహుల్ గాంధీ నాయకత్వంలో..

యువత విద్వేషం కాదు.. విశ్వాసం కోరుకుంటోంది. అహంకారం కాదు.. జవాబుదారీతనం కోరుకుంటోంది. ప్రచారం కాదు. పారదర్శక పాలననే యువత కోరుకుంటోందని గాటు వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణకు కీలకం అని, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అందిస్తుందని అన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తోందని, ప్రజల గొంతు వినే ప్రభుత్వాలే చరిత్రలో నిలుస్తాయని అన్నారు. భారత్‌ను భయంతో కాదు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Also read: నీట్ పేపర్ లీక్ తీవ్ర దుమారం.. రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్, ప్రదీప్ రంగనాథన్!

Related News

GHMC: హైదరాబాద్‌కు మరో కొత్త వెలుగులు.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం!

ఢిల్లీ విద్యార్థుల దాడి పై బీఆర్ఎస్ మౌనం.. వెలుగులోకి సంచలనాలు?

తెలంగాణలో కొత్త లిఫ్ట్ చట్టం.. ఇకపై నాణ్యత లేకపోతే కంపెనీలపై కఠిన చర్యలు

కేటీఆర్ బినామీ సంస్థ వల్లే 27 మంది మరణం, చిట్ చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

దేశమంతా రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, హైదరాబాద్ మాటేంటి?

RTO Brokers: ఆర్టీఏలో ఏజెంట్ల రాజ్యానికి ఎండ్ కార్డ్?.. యాక్షన్‌లో అధికారులు!

Etela Rajender: రోడ్లెక్కి ధర్నాలా? రాహుల్, ప్రియాంకలపై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×