Samantha: ఇండస్ట్రీలో పైకి కనిపించే ముఖాలు అన్ని నిజం కాదు. వారి వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఆ మేకప్ వెనుక వారికంటూ సపరేట్ ముఖం దాగి ఉంటుంది. అందుకే అంటారు.. ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి. కానీ, అవేమి బయటకు కనిపించవు అని. సినిమా రంగంలో ఎఫైర్స్ ఎక్కువ. క్యాస్టింగ్ కౌచ్ లు అనేవి వర్క్ ప్లేస్ లోనే జరుగుతాయి. కానీ, అవి కాకుండా ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి. పెళ్ళైన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు.. హీరోయిన్ మోజులో పడడం, కుటుంబాన్ని వదిలేయడం, భార్య నుంచి వేరు అవ్వడం ఇలాంటివి సినిమాల్లోనే చూపిస్తారు అనేది పొరపాటు. బయట కూడా ఇలాంటివి జరుగుతాయి. కానీ, బయటకు రావు అంతే.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. సమంత- రాజ్ నిడిమోరు రిలేషన్ పై ఇండస్ట్రీలో చాలా చర్చలు నడుస్తున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సామ్.. నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకొని విడిపోయింది. వీరిద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయి.. తప్పు ఎవరిది అనేది ఎవరికీ తెలియదు. విడాకుల అనంతరం.. చై, శోభితాతో కొత్త లైఫ్ ను మొదలుపెట్టాడు. సమంత మయోసైటిస్ చికిత్స కోసం ఏడాది పాటు రెస్ట్ తీసుకొని .. ఆ తరువాత రాజ్ నిడిమోరుతో బయటకు వచ్చింది.
ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సిరీస్ లతో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరువాతనే చై – సామ్ కు మధ్య గొడవలు మొదలయ్యాయి అనే రూమర్ ఉంది. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో సామ్ రిలేషన్ లో ఉంది అనే వార్తలకు అది ఆజ్యం పోసింది. అప్పటి నుంచి కూడా రాజ్ తో సామ్ పరిచయం మొదలయిందని చెప్పొచ్చు. ఆ పరిచయం.. ఇప్పుడు ప్రేమకు దారి తీసిందా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి.
ప్రేమ ఎప్పుడు.. ఎవరి మధ్య ఎందుకు పుడుతుందో అనేది ఎవరం చెప్పలేం. కానీ, రాజ్ నిడిమోరుకు పెళ్లి అయ్యింది. అతనికి భార్య ఉంది. ఆమెతో విడిపోయినట్లు దాఖలాలు లేవు. విడాకులు తీసుకోలేదు. సామ్ తో రాజ్ పేరు సోషల్ మీడియా మొత్తం వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో రాజ్ భార్య పరిస్థితి ఏంటి..? అన్యోన్యంగా ఉన్న కాపురంలో సామ్ చిచ్చు పెట్టిందా.. ? అంటే నిజం అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతేడాది ప్రేమికుల దినోత్సవం వరకు కూడా రాజ్ భార్య శ్యామాలి తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వారి ప్రేమ ఎంత గొప్పదో చెప్పుకొచ్చింది.
ఇక ఈ మధ్యకాలంలో శ్యామాలి పోస్ట్స్ లో ప్రేమలేదు బాధ కనిపిస్తుంది. ఒకసారి కర్మ గురించి చెప్పుకొస్తుంది. ఇంకోసారి నమ్మకం. ఇలా తనను తన భర్త మోసం చేశాడు అనే విధంగా ఆమె ఈ పోస్టులను పెడుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. అన్యోన్యంగా ఉన్న కాపురంలో సామ్ వచ్చి.. రాజ్ ను తన్నుకుపోయిందనే బాధ ఆమెలో కనిపిస్తుంది. మొన్నటికి మొన్న .. “కాలం అన్నింటిని బయటపెడుతోంది. కర్మ ఎవరిని వదలదు. అన్నింటికీ సమాధానం చెప్తుంది” అంటూ రాసుకొచ్చిన శ్యామాలి.. ఇప్పుడు నమ్మకం గురించి చెప్పుకొచ్చింది. ” ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది నమ్మకం. దాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి తీసుకురాలేం” అని రాసుకొచ్చింది. అంటే తన భర్త..తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఒక కాపురంలో చిచ్చు పెట్టావ్.. సిగ్గుగా అనిపించడం లేదా సామ్ అని కొందరు ఫైర్ అవుతున్నారు. భార్యకు విడాకులు ఇవ్వకుండా సామ్ తో రిలేషన్ లో ఉన్న రాజ్ ను సైతం నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు.