Pallavi Prashanth – Gautham Krishna: గౌతమ్ కృష్ణ (Gautham Krishna)పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇదివరకే “ఆకాశవీధుల్లో” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన గౌతం త్వరలోనే “సోలో బాయ్” (Solo Boy)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
సోలో బాయ్ గా గౌతమ్ కృష్ణ…
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక మధ్య తరగతిలో జన్మించిన కుర్రాడు జీవితంలో ఎన్నో అవమానాలను ఆటంకాలను ఎదుర్కొని ఎలా ఉన్నత స్థాయికి వెళ్లారనే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా గౌతమ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
వీర జవాన్ మురళి నాయక్…
గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 7,8 కార్యక్రమాలలో పాల్గొని ప్రేక్షకులను సందడి చేశారు అయితే సీజన్ 8 లో ఈయన రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గౌతం కృష్ణ పదివారాల పాటు కొనసాగానని, నాకు 30 లక్షలు వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిపారు. అయితే ఈ 30 లక్షల రూపాయలలో తాను 15 లక్షల రూపాయలు సమవర్ధిని అనే ఫౌండేషన్ కోసం ఇప్పుడే డొనేట్ చేస్తున్నాను అంటూ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా వీర జవాన్ మురళి నాయక్(Murali Nayak) తల్లిదండ్రులు పాల్గొనడంతో ముందుగా ఆ కుటుంబానికి లక్ష రూపాయలు అందచేస్తున్నాను అంటూ ఈయన వేదికపైనే లక్ష రూపాయలు అందజేశారు.. ఇకపోతే ఈయన సహాయం కేవలం మాటలు వరకు మాత్రమే కాదు చేతులలో కూడా ఉంటుందని తెలిపారు.
రైతులను మోసం చేసిన ప్రశాంత్…
తాను సంపాదించే ప్రతి రూపాయిలో కూడా కొంత భాగం ఇలా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తానని తెలిపారు. ప్రతినెల నేను సమవర్ధిని ట్రస్ట్ కు ఎంత డొనేట్ చేశాను అనేది తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేస్తానని కూడా తెలియజేశారు. ఇలా సంపాదించిన దాంట్లో కొంత భాగం సామాజిక సేవ కోసం ఉపయోగిస్తున్న నేపథ్యంలో నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా గౌతంపై ప్రశంసలు కురిపించగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ను ఏకిపారేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గెలుచుకున్న డబ్బు మొత్తం రైతులకు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు రైతులకు ఆ డబ్బును ఇవ్వకుండా మాట తప్పడంతో ఈయనని టార్గెట్ చేస్తూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రశాంత్ సింపతి డ్రామాలు ఆడి డబ్బు గెలుచుకున్నారని, అయితే ఆ డబ్బును పంచకుండా మాట తప్పారు.. కాస్త గౌతమ్ ని చూసి అయినా నేర్చుకో, ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఎవరనీ నమ్మకూడదు? కావాలానే మా ఇద్దరిని ఫ్రేమ్ చేస్తున్నారు.. ‘కిస్సిక్ టాక్స్’లో నిఖిల్