Satya Sri: సత్య శ్రీ పేరు వినగానే టక్కున చమ్మక్ చంద్రతో కలిసి ఈమె చేసిన కామెడీ కళ్ళ ముందు కనపడుతుంది. జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో చమ్మక్ చంద్ర (Chammak Chandra)టీంలో ఆయనతో కలిసి సత్య శ్రీ (Satya Sri)పెద్ద ఎత్తున స్కిట్లు చేస్తూ కామెడీ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సత్య శ్రీ కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు కానీ ఇటీవల తిరిగి జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అదేవిధంగా సత్య శ్రీ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసినదే.
చిరంజీవితో సెల్ఫీ…
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పై తనకున్నటువంటి అభిమానం గురించి తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తనకు చాలా ఇష్టమని ఆయనకు పెద్ద అభిమాని అని తెలిపారు. అయితే మొదటిసారి చిరంజీవి గారిని తాను “తేజ్ ఐ లవ్ యు” అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కలిసానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి గారిని చూడగానే ఆయనతో సెల్ఫీ (Selfie)దిగాలని వెళ్లినట్టు సత్య శ్రీ గుర్తు చేసుకున్నారు.
గుర్తుపెట్టుకుని మరి సెల్ఫీ ఇచ్చారు…
ఇలా చిరంజీవి గారి వద్దకు వెళ్లి సర్ మీతో సెల్ఫీ కావాలి అని అడగడంతో వెంటనే ఓకే చెప్పారు. కానీ ఆ సమయంలోనే ఇతరులు పిలవడంతో చిరంజీవి గారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత చిరంజీవి గారు నన్ను పిలిచి ఇందాక నువ్వే కదా సెల్ఫీ అడిగిందని గుర్తు చేసుకొని మరి నాతో సెల్ఫీ దిగారని సత్య శ్రీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా చిరంజీవి గారు పిలిచి మరి సెల్ఫీ ఇవ్వడంతో ఆ క్షణం కళ్ళలో నీళ్లు ఆగలేదని సత్య శ్రీ తెలిపారు.
సినిమా పేర్లతో కవిత…
ఇక ఈ ఘటన తర్వాత మరోసారి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లలో భాగంగా తాను సుమ అడ్డా కార్యక్రమంలో మరోసారి చిరంజీవి గారిని కలిసాను అయితే మా నాన్నగారు కూడా చిరంజీవి గారికి పెద్ద అభిమాని అని, ఆయన చిరంజీవి గారి సినిమాల పేర్లతో ఒక కవిత రాసి ఇచ్చారు దానిని ప్రేమ్ చేయించి ఈ కార్యక్రమంలో చిరంజీవి గారికి ఇస్తే చాలా సంబరపడ్డారని ఆ ఫోటో ప్రేమ్ ఆఫీసులో పెట్టుకుంటానని చిరంజీవి గారు చెప్పినట్లు సత్య శ్రీ తెలిపారు. ఇక ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సమయంలో కూడా మరోసారి చిరంజీవి గారిని కలవగానే ఆయన నన్ను చూసి నువ్వు సుమ అడ్డా షోకి వచ్చావు కదా అంటూ నన్ను గుర్తుపట్టారు. అలా చిరంజీవి గారు నన్ను గుర్తు పట్టడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటూ సత్య శ్రీ చిరంజీవి గారిని కలిసిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: మహేష్ బాబు మూవీ కోసం ఏకంగా నగరాన్నే సృష్టిస్తున్న జక్కన్న.. వామ్మో, అన్ని కోట్లా?