OTT Movies : ప్రతినెలా థియేటర్లోకి కొత్త సినిమాలు వస్తుంటాయి.. ఈ జులై నెలలో మాత్రం కాస్త ఎక్కువగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఆ హీరోల అభిమానులు సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది.. ప్రస్తుతం అయితే పర్వాలేదు నేను టాక్ ని సొంతం చేసుకుంది.. ఇక ఈనెల అందరూ ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది.. థియేటర్ల పరంగా కొత్త సినిమాలు వస్తున్నా సరే మూవీ లవర్స్ మాత్రం ఎక్కువగా ఓటీటీలో వస్తున్న సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
ప్రతి వారం లాగే ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసాయి. ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో కామెడీ, రొమాంటిక్, హారర్ థ్రిల్లర్స్ వంటి అనేక జోనర్స్ ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు..? ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్…
ఆల్ ది షార్క్స్ (ఇంగ్లీష్ కాంపిటీషన్ సిరీస్)- జూలై 4
రాజాపుతిరిన్ (తమిళ్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- సింప్లీ సౌత్ ఓటీటీ- జూలై 4
ఆశ జావోర్ మాఝే (బెంగాలీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 4
అమెజాన్ ప్రైమ్..
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4 (టెంట్‌కొట్టా ఓటీటీలో కూడా)
ఉప్పు కప్పురంబు (తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4
సన్ నెక్ట్స్..
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 4
జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 4
ఆహా..
శ్రీ శ్రీ శ్రీ రాజావారు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూలై 4 (ఆహా తెలుగు)
పరమశివన్ ఫాతిమా (తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4 (ఆహా తమిళ్)
సోనీలివ్..
ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 4
జీ5 ఓటీటీ..
కాళీధర్ లపతా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 4
జియో హాట్‌స్టార్..
గుడ్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ తమిళ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 4
Also Read: ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది.. చరిత్రను తిరగరాసిన ‘హరిహర వీరమల్లు..
మొత్తానికి ఇవాళ ఓటీటీలోకి 13 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కీర్తి సురేష్-సుహాస్ ఉప్పు కప్పురంబు, ప్రియమణి గుడ్ వైఫ్, నార్నే నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు, మద్రాస్ మ్యాట్నీ, జగమెరిగిన సత్యం, అభిషేక్ బచ్చన్ కాళీధర్ లపతా సినిమాలు ఆసక్తికరంగా ఆకట్టుకుంటున్నాయి.. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి మీకు నచ్చిన సినిమాను మీరు మెచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి..