E-Paper
Advertisement

పేరుకే స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.3000 ఫోన్ వాడుతున్న ఆ నటుడు ఎవరో తెలుసా?

పేరుకే స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.3000 ఫోన్ వాడుతున్న ఆ నటుడు ఎవరో తెలుసా?
Advertisement

Tollywood: సినిమా సెలబ్రిటీలు అనగానే లగ్జరీ లైఫ్ గుర్తుకొస్తుంది.. ఖరీదైన బంగ్లాలు.. విలాసవంతమైన జీవితం మన ముందు కదలాడుతుంది. అయితే ప్రతి ఒక్క సెలబ్రిటీ లైఫ్ ఇలాగే గొప్పగా ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది తమ హుందాతనాన్ని చూపిస్తే.. మరికొంతమంది ఆర్థికంగా చితికి పోయినా సరే లగ్జరీగా కనిపిస్తూ ఉంటారు. ఇంకొంత మంది వేలకోట్ల ఆస్తులు ఉన్నా చాలా సింపుల్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే సెలబ్రిటీలు అనగానే వారి జీవన విధానమే కాదు వారు ఉపయోగించే వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక స్టార్ నటుడు ఇప్పటికీ ఇంకా 3 వేల రూపాయల విలువ చేసే కీప్యాడ్ మొబైల్ వాడుతున్నారని తెలుసా? ఆయన ఎవరు? ఎందుకు ఆ మొబైల్ ఉపయోగిస్తున్నారో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్ ఫోన్ వాడకం.. ఏదో తెలియని భయం..

ఆయన ఎవరో కాదు.. ప్రముఖ సీనియర్ స్టార్ నటుడు ఎల్బీ శ్రీరామ్. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన కామెడీ ,ఎమోషన్ పండించడంలో దిట్ట. అలాంటి ఈయన డిజిటల్ అలవాట్లు, జీవితం పట్ల తన ఆలోచన ధోరణి గురించి వివరించారు. తనకు 30 వేల రూపాయల విలువ చేసే ఫోన్ కొనుగోలు చేసే స్తోమత ఉన్నప్పటికీ కేవలం 3000 రూపాయల సాధారణ ఫోన్ ని మాత్రమే వాడుతానని, అది ఎందుకు అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నాలో ఏదో తెలియని భయం నెలకొంది.

అందరిలాగే నాకు కూడా 24 గంటలే..

Advertisement

ఇది సృజనాత్మకతకు ఆటంకం కలిగిస్తుంది. ఒక దశలో ల్యాండ్ లైన్ ఫోన్ వాడాలనుకున్నాను. సోషల్ మీడియా ఫేస్ బుక్ లో నా స్నేహితులు పెట్టే కామెంట్లు, వాటికి స్పందించాలనే కోరిక ఉన్నప్పటికీ నా సృజనాత్మకతను అవి ఆపివేస్తాయనే ఆందోళన నాలో కలిగింది. అందరిలాగే నాకు కూడా 24 గంటలే.. 25 గంటలు లేవు కదా.. ఆ జబ్బులో పడిపోతే నేను క్రియేషన్ చేయలేను . ఇక నా పని కోసం నేను కేవలం టాబ్లెట్ ను మాత్రమే ఉపయోగిస్తాను”.

ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం.. తప్పని ఆరోగ్య తిప్పలు..

“ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి . ఈ వయసులో నాకు మరో కొత్త అనారోగ్య సమస్య ఎందుకు. నేను ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి పాలైతే ఆస్తులు కరిగించుకోవడానికి నా వద్ద సంపద లేదు. అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను. తెలియని రోగాలు ఎన్నో పొంచి ఉన్నాయి. ఎప్పుడు ఏది కాపు కాసి మనకు వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి.

Advertisement

also read:సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన అనిల్.. వర్క్ అవుట్ అవుతుందా?

6 నెలలకు ఒకసారి తప్పనిసరి చెకప్..

థర్డ్ స్టేజిలో వచ్చే వ్యాధుల గురించి ఆరు నెలలకు ఒకసారి చెక్ అప్ చేయించుకోవాలి. మృత్యువు లక్ష మార్గాలలో వెంటాడుతుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మృత్యువు మనల్ని కబలిస్తే ఇక మన పరిస్థితి ఏంటి? అక్కడితో జీవితం ఆగిపోతుంది కదా.. అందుకే దేనినైనా సరే ఆచితూచి ఉపయోగించాలి” అంటూ చాలా సృజనాత్మకంగా మాట్లాడారు ఎల్బీ శ్రీరామ్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×