Senior Actor: సాధారణంగా పేగు పంచుకొని పుట్టిన పిల్లలని ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ పిల్లలకు చిన్నగా జ్వరం వచ్చినా సరే తట్టుకోలేని తల్లిదండ్రులు ఉన్నారనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నప్పటికీ.. తన కళ్ళముందే తన కొడుకు మరణాన్ని కోరుకొని, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు ఆ హీరో ఎవరు? అసలు కన్న కొడుకు మరణాన్ని కోరుకునే అంత కసాయిగా ఎందుకు మారారు? కన్నా కొడుకు మరణాన్ని కోరుకునే అంత బాధ ఆ తండ్రికి ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
కన్న కొడుకు మరణాన్ని అందుకే కోరుకున్నా – ప్రసాద్ బాబు..
ఈయన ఒక స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈయన.. దర్శకుడిగా కూడా సినిమాలు చేసి బహుమఖ ప్రజ్ఞాశాలిగా పేరు అందుకున్నారు. ఈయన ఎవరో కాదు ప్రసాద్ బాబు Prasad Babu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన కొడుకు గురించి అలాగే తన కొడుకు మరణాన్ని కోరుకోవడం గురించి అసలు విషయం తెలియజేశారు. ప్రసాద్ బాబు మాట్లాడుతూ..” నేను ‘సాహస బాలలు’ సినిమా చేయడానికి కారణం నా పెద్ద కొడుకు. అతను ఒక మానసిక వికలాంగుడు. మాలాగే ఒక కళాకారుడిని చేయాలి అని ఆశ ఉండేది. స్వతహాగా తనకు మాటలు రావు. ఒకసారి ఏమైందంటే స్కూల్లో ఇతర విద్యార్థులతో పాటు నా కొడుకుని కూడా ఒక ప్రోగ్రాం కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. తనకు మాటలు రాకపోయినా సరే ఢిల్లీ తీసుకెళ్తున్నారు.. మరి ఒక తండ్రిగా ఇక్కడ నేనేం చేస్తున్నాను? అనే ప్రశ్న మొదలైంది.
కొడుకుపై చిత్రం.. ఏకంగా బంగారు నంది..
దాంతో అప్పటికప్పుడు ఒక కథ అనుకొని.. దాన్ని తెరపై చిత్రీకరించాను. అదే సాహస బాలలు. ఈ చిత్రంలో సోమయాజులు, నాగబాబు, మురళీమోహన్ తదితరులు నటించారు. ఈ సినిమా కసితో చేయడం వల్ల బంగారు నంది లభించింది. కానీ నాకు దూరంగా నా కొడుకు వెళ్లిపోయాడు. అయితే ఒకసారి మే నెలలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది. దాంతో సడన్గా గుండెపోటు కూడా రావడంతో అక్కడికక్కడే గ్రౌండ్లో చనిపోయాడు. అప్పటికి వాడి వయసు 30 ఏళ్లు. నేను బ్రతికుండగానే వీడు చనిపోవాలి అని మనసులో కోరుకున్నాను. అయితే ఆరోజు ఆ కోరిక నెరవేరింది. నిజానికి ఈ కోరిక ఎందుకు కోరుకున్నాను అంటే నేను చనిపోయాక వాడిని ఎవరు చూస్తారు.. అసలు చూస్తారో లేదో అనే భయం ఉండేది. అందుకే తన పేరు మీద స్థలం కూడా రాసి పెట్టాను. కానీ నాకంటే ముందే వాడు చనిపోయాడు. అప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను అంటూ తెలిపారు. మొత్తానికి అయితే మానసిక వికలాంగుడు కాబట్టే ఆ అబ్బాయి భవిష్యత్తు గురించి ఆలోచించి ముందే చనిపోవాలని కోరుకున్నట్లు ప్రసాద్ బాబు తెలిపారు.
ప్రసాద్ బాబు కెరియర్..
ప్రసాద్ బాబు విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు కరణం లీలా వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్. పునాది రాళ్లు సినిమాతో నటుడిగా కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్, రుద్రవీణ, ఆపద్బాంధవుడు ఇలా దాదాపు తెలుగు l,తమిళ్ భాషల్లో 1500కు పైగా సినిమాల్లో నటించారు.
ALSO READ:SSMB 29: ఆగస్టు 9న మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్.. రెడీగా వుండడమ్మా ?