OTT Conditions on Anushka Ghaati New Release Date: స్వీటీ అనుష్క శెట్టి మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఉమెన్ సెంట్రిక్ గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం స్వీటీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ అభిమానులను నిరాశ పరుస్తోంది. మొదట ఏప్రిల్ 18న మూవీ రిలీజ్ అని ప్రకటించారు. అనౌన్స్మెంట్ ని వినూత్నంగా ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. కాస్తా గ్యాప్ తీసుకుని మళ్లీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జూలై 11న కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ఘాటీ కొత్త రిలీజ్ డేట్ ఇదే
దీంతో ఈసారి స్వీటీ రావడం పక్కా అని ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు. కానీ, ఈసారి కూడా స్వీటీ హ్యాండ్ ఇచ్చింది. కొన్ని కారణాల మరోసారి ఘాటీ వాయిదా పడింది. దీంతో మూవీ కొత్త రిలీజ్ డేట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈసారి ఘాటీ విడుదల తేదీ అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ తేదీ కూడా వర్కౌట్ అయ్యేల కనిపించడం లేదు. ఎందుకంటే నెక్ట్స్ లైనప్ లో భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఓజీ,చిరంజీవి విశ్వంభర, శివ కార్తికేయన్ ‘మిరాయ్’ వంటిసినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
స్వీటీకి పెద్ద హీరోల పోటీ
ఓజీ, మిరాయ్ సినిమాలు సెప్టెంబర్ ను లాక్ చేసుకున్నాయి. ఈ పెద్ద సినిమాలతో అనుష్క ఘాటీని రిలీజ్ చేయడం రిస్క్ అని మూవీ టీం భావిస్తోందట. దీంతో సెప్టెంబర్ 5న విడుదల చేయలా.. వద్దా అనే డైలామాలో ఉంది ఘాటీ టీం. ఒకవేళ ఈ తేదీన రాకపోతే ఈ సినిమా మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో వీలుకాకపోతే.. ఇక డిసెంబర్ వరకు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఇన్ సైడ్ సినీ సర్కిల్లో టాక్. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందట. అయితే ఘాటీ లాంగ్ బ్యాక్ వెళ్లడం వల్ల ఓటీటీ డీల్ లో భారీ కోతలు పడేలా ఉందట.
ఘాటీకి ఓటీటీ షాక్
ఈ సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయకపోవడంపై మూవీ ఓటీటీ పార్ట్నర్ అసహనం వ్యక్తం చేస్తోంది. సినిమా సెప్టెంబర్ విడుదల చేస్తే సరి లేదంటే.. తమ ఒప్పందం ప్రకారం రైట్స్ లో రూ.4 కోట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తుందట. దీంతో మేకర్స్ కి ఘాటీ రిలీజ్ డేట్ పెద్ద సమస్యగా మారింది. సెప్టెంబర్ వస్తే పెద్ద సినిమాల పోటీ, డిసెంబర్ రిలీజ్ చేస్తే ఓటీటీ డీల్ నష్టం.. దీంతో ఘాటీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ సతమవుతున్నారట. ఇలా సినిమాలపై ఓటీటీ పెత్తనం మేకర్స్ తలనొప్పిగా మారిందంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఘాటీ మూవీ డిసెంబర్ లోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైం దక్కించుకున్న సంగతి తెలిసిందే.