SSMB 29:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన సినీ కెరియర్ లో తొలిసారి ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారు. రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో భారీ అంచనాల మధ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఆగస్టు 9న మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు అభిమానులకు భారీ సర్ప్రైజ్ తో పాటు గుడ్ న్యూస్ చెప్పబోతోంది చిత్ర బృందం అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమా నుండి ఆగస్టు 9వ తేదీన గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.
కీలక సన్నివేశాలపై బిజీగా పని చేస్తున్న రాజమౌళి..
ఇదిలా ఉండగా రాజమౌళి కీలక సన్నివేశాలను మరింత మాడిఫై చేయడంలో బిజీగా ఉన్నారని, అలా మాడిఫై చేసిన సన్నివేశాలను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే ఒక మహేష్ అభిమానులకే కాదు యావత్ సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కబోతుండడంతో ప్రతి దృశ్యాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. అందుకే సమయం తీసుకుని మరీ ఈ సినిమాను చాలా పగడ్బందీగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
1000 కోట్ల భారీ బడ్జెట్తో..
మరొకవైపు ఈ సినిమాకి భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. రూ.1000 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ఉంటుందని, అటు హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇక ఇప్పుడేమో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో భాగమవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి భారీ అంచనాల మధ్య ఎవరి ఊహకు అందని రీతిలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని.. కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ కొడుతుందని కూడా అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ALSO READ:Film industry: ఇదెక్కడి క్రేజ్ మావా.. విడుదలకి ఏడాది ముందే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్స్!