Actor Suman:సినిమా ఇండస్ట్రీకి , రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారకరామారావు (Sr NTR) మొదలుకొని.. ఇప్పటికే ఎంతోమంది సినిమాలలో సత్తా చాటుతూ రాజకీయాలలో కూడా ముందడుగు వేస్తున్నారు. అయితే సినిమాల నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతున్నారా? అంటే చెప్పలేని పరిస్థితి. రాజకీయ రంగంలో కొంతమంది సీఎం అయిన వాళ్లు కూడా ఉన్నారు. మరి కొంతమంది అక్కడ ఒత్తిడిలు తట్టుకోలేక తిరిగి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు కూడా లేకపోలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ రాజకీయాలపై మాత్రం చాలా మందికి ఆసక్తి ఉందనే చెప్పాలి. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ సీనియర్ హీరో సుమన్ (Suman) కూడా చేరబోతున్నారు అని సమాచారం.
రాజకీయ ఎంట్రీపై నటుడు సుమన్ కామెంట్స్..
తాజాగా రాజకీయ ఎంట్రీపై నటుడు సుమన్ మాట్లాడుతూ… “తమిళనాడులో సీటు ఇస్తామని చెబుతున్నారు. కానీ వచ్చే ఎన్నికలలో ఏపీ రాజకీయాలలో పోటీ చేస్తాను” అంటూ సుమన్ తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సుమన్ ను రాజకీయాలలో చూడబోతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆ పార్టీకే మద్దతు..
ఇదిలా ఉండగా గత రెండు సంవత్సరాల క్రితం కూడా సుమన్ రాజకీయ ఎంట్రీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గత రెండేళ్ల క్రితం ఒక పొలిటికల్ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్. తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని, కాకపోతే అక్కడ తనకు మద్దతు ఇచ్చే పార్టీ బిఆర్ఎస్ కే అని తెలిపారు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు కాబట్టి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్న. ఎందుకంటే అటు టీడీపీ , ఇటు వైఎస్ఆర్సిపీ రెండు పార్టీలతో కూడా సుమన్ కి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
సుమన్ కెరియర్..
ఇక సుమన్ కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi ), బాలకృష్ణ (Balakrishna) వంటి హీరోలకి కూడా తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చారు.. కెరియర్ పీక్స్ లో ఉండగానే ఒక కేసులో ఇరుక్కొని ఎన్నో అవస్థలు పడ్డారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నిజానికి సుమన్ పై కేసు మోపినప్పుడు ఇండస్ట్రీలో ఎవరు ముందుకు రాకపోయినా.. చాలామంది హీరోయిన్స్ మాత్రం సుమన్ కి అండగా నిలిచార. తాను అలాంటి వ్యక్తి కాదు అని, ఎవరో తప్పుడు కేసు పెట్టారు అని ఆయనకు సపోర్టుగా నిలబడ్డారు. ఇక ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ సుమన్.. ‘శివాజీ’ సినిమాతో విలన్ గా చేసి.. ఈ పాత్రకు 20201 లో లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.
ALSO READ:War 2: చిన్న గ్లింప్స్ తో భారీ హైప్.. నిర్మాతల సరికొత్త స్ట్రాటజీ!