War 2 Movie:ఒక సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలి అంటే 24 విభాగాలకు చెందిన కార్మికులు ఎంతో కష్టపడతారు. అటు నటీనటులు, దర్శక నిర్మాతలు సినిమా సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.అంతకుమించి త్యాగాలు కూడా చేస్తారు. అయితే అలా థియేటర్లలోకి వచ్చిన సినిమా ఒక్కోసారి హిట్ అవ్వచ్చు.. డిజాస్టర్ కూడా అవ్వచ్చు. అంతా ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించడం దర్శకులకు కత్తి మీద సాము లాంటిది.. అందుకే అటు ప్రమోషన్స్ లో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తూ ఉంటారు.. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) సంస్థ కూడా చేరిపోయింది.
థియేటర్ కి ప్రేక్షకుడిని రప్పించడానికి నిర్మాతలు విశ్వప్రయత్నం..
తమ సినిమాపై హైప్ పెంచుతూ.. ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంతోపాటు కలెక్షన్లు పెంచుకోవడానికి వినూత్న ప్లాన్ వేసింది. ఒకవేళ ఇది వర్కౌట్ అయిందంటే మాత్రం నిర్మాణ సంస్థకు భారీగా లాభాలు వచ్చి పడతాయని చెప్పవచ్చు.. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya chopra) అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’.
ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మధ్య స్పెషల్ డాన్స్ సాంగ్..
ఎన్టీఆర్ (NTR) విలన్ గా హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా వస్తున్న ఈ సినిమాలో.. వీరిద్దరి మధ్య ఒక డాన్స్ సాంగ్ ఉందని, ఈ పాటలో వీరిద్దరూ పోటీపడి మరీ డాన్స్ వేశారని, అలాగే పాట మొత్తంలో ఇద్దరిలో ఎవరిని చూడాలో కూడా తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజన్లో పడిపోతారని.. ఇప్పటికే బాలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సాంగ్ ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేసి, సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
గ్లింప్స్ తోనే హైప్ పెంచనున్న నిర్మాత..
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాత ఆదిత్య మాత్రం హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఈ స్పెషల్ డాన్స్ సాంగ్ ను నేరుగా రిలీజ్ చేయాలని అనుకోవడం లేదట. ఈ పాట కోసమైనా ఆడియన్స్ థియేటర్లకు రావాలి అని నిర్మాత ఆదిత్య చోప్రా అనుకుంటున్నారని. అందుకే అందరూ అనుకున్నట్టు కాకుండా ఈ పాట నుంచి చిన్న గ్లింప్ రిలీజ్ చేసి దీనితోనే సినిమాపై అంచనాలు పెంచాలి అని భావిస్తున్నారట. కనీసం ఈ పాటపై ఉన్న క్యూరియాసిటీ తోనైనా థియేటర్ కి ఆడియన్స్ వస్తారని భావిస్తున్నారట.
వర్కౌట్ అయితే భారీ లాభం..
అటు ఆగస్టు 14వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసింది. అప్పటివరకు ఈ పాటపై హైప్ పెంచుతూ నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసమైనా ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడు అని, తద్వారా కలెక్షన్లు పెరుగుతాయని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.. మరి ఏ మేరకు ఇది వర్కౌట్ అవుతుందో చూడాలి.. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం నిర్మాణ సంస్థకు భారీగా లాభాలు వచ్చి పడతాయని చెప్పవచ్చు.
ALSO READ:Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా