Trains Cancelled: మెరుగైన రైల్వే ప్రయాణాలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ట్రాక్ మరమ్మతులు, ఇంటర్ లాకింగ్ పనులు, సిగ్నలింగ్ అప్ డేట్స్, రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలు చేపడుతూనే ఉంది. ఈ పనుల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రైల్వే సేవలు ప్రభావితం అవుతాయి. తాజాగా రైల్వే ఫ్లైఓవర్ నిర్వహణ పనుల కారణంగా కేరళ నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇవాళ(ఆగష్టు 6న) క్యాన్సిల్ అయిన రైళ్లు
పాలక్కాడ్ ఎర్నాకుళం మెము (66609), ఎర్నాకుళం – పాలక్కాడ్ మెము (66610) సహా రెండు రైళ్లు ఈరోజు రద్దు చేయబడ్డాయి. మరో మూడు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇండోర్ – తిరువనంతపురం నార్త్ ఎక్స్ ప్రెస్ (22645), కన్నూర్ – అలప్పుజ ఎగ్జిక్యూటివ్ (16308), సికింద్రాబాద్ – తిరువనంతపురం సెంట్రల్ శబరి ఎక్స్ ప్రెస్ (17230) ఆలస్యంగా నడుస్తాయి.
ఈ నిర్వహణ పనులు వచ్చే ఆదివారం వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సో, బుధవారం, శనివారం, ఆదివారం ఎర్నాకుళం – పాలక్కాడ్, పాలక్కాడ్ – ఎర్నాకుళం మెము సర్వీసులు రద్దు చేయబడతాయని అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఇండోర్-తిరువనంతపురం నార్త్ ఎక్స్ ప్రెస్ ఒక గంట 30 నిమిషాలు ఆలస్యం అవుతుందన్నారు. కన్నూర్-అలప్పుళ ఎగ్జిక్యూటివ్ ఒక గంట 20 నిమిషాలు ఆలస్యం అవుతుంది వెల్లడించారు. సికింద్రాబాద్- తిరువనంతపురం సెంట్రల్ శబరి ఎక్స్ ప్రెస్ 30 నిమిషాలు ఆలస్యం అవుతుందని వివరించారు.
Read Also: దేశం రిచ్చెస్ట్ రైలు ఇదే, ఏడాది ఎన్ని కోట్లు సంపాదిస్తుందంటే?
ప్రయాణానికి ముందు రైళ్లను తనిఖీ చేయాలన్న అధికారులు
ఏ రైళ్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేయనునట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల రద్దు, ఆలస్యానికి సంబంధించిన రైళ్ల వివరాలు రైల్ వన్ యాప్ లో ప్రయాణీకులు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. రైళ్ల సమయాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
Read Also: చర్లపల్లి స్టేషన్ కు అదనపు MMTS రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వ్యాఖ్యలు!