Actress Saradha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి శారద (Saradha)ఒకరు. పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం అమ్మ పాత్రలు నానమ్మ ,అమ్మమ్మ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి కూడా తల్లి పాత్రలలో నటించి మెప్పించిన శారద గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరంగా శారద చెన్నైలో నివాసం ఉంటున్నారు.
ఇటీవల కాలంలో శారద సినిమా వేడుకలలో కూడా పెద్దగా కనిపించలేదని చెప్పాలి. అయితే తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శారద గారు నడవలేని పరిస్థితిలో ఉండడం చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తాజాగా శారద చెన్నైలో ధీపుట్టు (Dhe puttu) రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కనిపించారు. ఇందులో భాగంగా ఈమె తన చేతుల మీదుగా జ్యోతి వెలిగించి రెస్టారెంట్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో భాగంగా ఈమె ఇతరుల సహాయంతో నిలబడి ఉన్నారు అలాగే తన చేతులు మొత్తం ఒణుకుతూ ఉన్నాయి. కనీసం సపోర్ట్ లేకుండా నడవలేని, నిలబడలేని పరిస్థితులలో శారదా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ శారద గారిని ఇలాంటి పరిస్థితులలో చూడటం చాలా బాధాకరం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించి ఓ వెలుగు వెలిగిన శారద వయసు పైబడటంతో సపోర్ట్ లేకుండా నడవలేని స్థితిని చూసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
?stkn=MWtkeG01ODQ1dDZ2OA==
ఇక నటి శారద సినీ కెరియర్ విషయానికి వస్తే.. నటి శారద అసలు పేరు సరస్వతీ దేవి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈమె సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.1955లో విడుదలైన ప్రసిద్ధ తెలుగు చిత్రం ‘కన్యాశుల్కం’ సినిమా ద్వారా బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. బాలనటిగా మొదలైన ఈమె ప్రయాణం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ తెలుగు తమిళ మలయాళ భాషలలో కూడా సినిమాలు చేశారు. ఈమె సినీ కెరియర్లో మూడు జాతీయ చలనచిత్రం పురస్కారాలను అందుకున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం , జె.సి. డేనియల్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. సినిమా రంగంలో వందల సినిమాలలో నటించిన శారద రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టారు.తెలుగుదేశం పార్టీలో చేరి తెనాలి నుంచి ఎన్నికలలో పోటీ చేసి 1996 నుండి 1998 వరకు లోక్‌సభ సభ్యురాలిగా (MP) బాధ్యతలను నిర్వర్తించారు.
Also Read: మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ‘ఆరుగురు పతివ్రతలు’ .. ఎప్పుడంటే?