E-Paper
Advertisement

15 సెకన్ల క్రితం ఏం మాట్లాడారో మళ్లీ వినొచ్చు.. యాపిల్ వాచ్‌లో సరికొత్త AI ఫీచర్!

15 సెకన్ల క్రితం ఏం మాట్లాడారో మళ్లీ వినొచ్చు.. యాపిల్ వాచ్‌లో సరికొత్త AI ఫీచర్!
Advertisement

Apple Watch AI Features: ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు సరిగ్గా వినిపించకపోయినా.. ఆ తర్వాత చెప్పిన విషయం గుర్తుకు రాకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. ఇకపై ఇలాంటి సందర్భాల్లో యాపిల్ వాచ్‌నే మనకు కొంతవరకు సాయం చేయనుంది. యాపిల్ తమ కొత్త వాచ్ మోడల్స్‌లో సంభాషణలను మళ్లీ వినిపించడంతో పాటు, రోజంతా జరిగిన ముఖ్యమైన విషయాలను సారాంశంగా చెప్పే రెండు కొత్త AI ఫీచర్లను తీసుకురాబోతోంది. ‘లైవ్ రీవైండ్’, ‘సిరి రీక్యాప్’ పేర్లతో వస్తున్న ఈ ఫీచర్లు యాపిల్ వాచ్‌ను మరింత ఉపయోగకరంగా మార్చే అవకాశం ఉంది. 0

లైవ్ రీవైండ్ ఏంటి?

ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు సరిగ్గా వినపడకపోతే ‘మళ్లీ చెప్పండి’ అని అడగటం సహజం. కానీ ఈ ఫీచర్ ఉంటే ఇక ఆ అవసరం ఉండదు. డిజిటల్ క్రౌన్‌‌ను రెండుసార్లు నొక్కితే చాలు.. గత 15 సెకన్ల సంభాషణను ఇది వెంటనే ప్లే చేసి వినిపిస్తుంది. ఈ క్లిప్‌ను భద్రపరుచుకోవాలని అనుకుంటే సిరి సహాయంతో దాచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మన ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదు. ఎందుకంటే.. ఆడియో డేటా ఏదీ శాశ్వతంగా డివైజ్‌లో రికార్డ్ అయి ఉండదు.

Advertisement

Also Read: వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

సిరి రీక్యాప్ ఉపయోగం:

మనం రోజంతా ఎంతోమందితో మాట్లాడుతుంటాం.. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. అలాంటి సందర్భాల్లో సిరి రీక్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజంతా జరిగిన సంభాషణలను ఇది సులభమైన సారాంశంగా మార్చి ఇస్తుంది. ఈ సమ్మరీలు వారం రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మనమే స్వయంగా సేవ్ చేసుకుంటే తప్ప తర్వాత వాటంతట అవే డిలీట్ అవుతాయి. సమాచారం అంతా కొత్త ఎస్11 చిప్‌సెట్‌లోని సెక్యూర్ ఎన్‌క్లేవ్‌ ద్వారా ప్రాసెస్ అవుతుంది. కాబట్టి.. భద్రతపై ఆందోళన అక్కర్లేదు.

సపోర్ట్ చేసే డివైజ్‌లు:

Advertisement

ఈ కొత్త ఆడియో ఇంటెలిజెన్స్ ఫీచర్లు వాడాలంటే యాపిల్ వాచ్ సిరీస్ 12 లేదా వాచ్ ఆల్ట్రా 4 ఉండాలి. వీటితో పాటు ఐఫోన్ 16 సిరీస్ నుంచి రాబోయే కొత్త ఐఫోన్ మోడల్స్ వరకు ఏవైనా సరిపోతాయి. ప్రారంభంలో ఈ ఫీచర్ కేవలం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో ఇతర భాషలకు కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

మార్కెట్‌లోకి ఎప్పుడు?

ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్లు బీటా వెర్షన్‌లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సాంకేతికతను వాడుకుంటూనే వినియోగదారుల ప్రైవసీకి పెద్దపీట వేయడం యాపిల్ ప్రత్యేకత. ఈ కొత్త ఫీచర్లు కూడా అదే నమ్మకంతో ముందుకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి గురించి మరిన్ని అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

Also Read: అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!

Tags

Related News

శాంసంగ్ M సిరీస్, ఫోల్డబుల్ ఫోన్లపై ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్లు.. ఇంత తక్కువకి మళ్లీ దొరకవు!

శాంసంగ్ నుంచి క్లిప్-ఆన్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. కిరాక్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్.. 2-ఇన్-1 ల్యాప్ టాప్

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది..’రోహిణి ఇంజనీరింగ్ కాలేజ్’ ప్రత్యేకతలివే!

పార్టీ లవర్స్ కోసం ఫర్ఫెక్ట్.. సౌండ్‌కి దిమ్మ తిరిగిపోవాల్సిందే !

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ కావాలా? శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ఫీచర్లు ఇవే!

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

Big Stories

Advertisement
×