Found Footage Horror Movie: ఓ పాడుబడిన ఆసుపత్రి… అక్కడ రాత్రి డ్యూటీకి వెళ్లిన ఓ సెక్యూరిటీ గార్డ్… అతడు ధరించిన బాడీక్యామ్‌లో రికార్డయిన కొన్ని గంటల ఫుటేజ్. మొదట ఖాళీగా కనిపించే ఆ ఆసుపత్రిలో క్రమంగా వింత సంఘటనలు మొదలవుతాయి. చీకటి కారిడార్లు, ఎవరో వెంబడిస్తున్నారనే అనుభూతి, కెమెరాలో చిక్కే ఊహించని దృశ్యాలు… చివరికి ఇది సాధారణ సెక్యూరిటీ డ్యూటీ కాదని అర్థమవుతుంది. అదే ‘ఇన్‌ఫర్మరీ’ (Infirmary) కథ. ఫౌండ్-ఫుటేజ్ స్టైల్లో తెరకెక్కిన ఈ హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ పాడుబడిన ఆసుపత్రిలో ఆ రాత్రి అసలు ఏం జరిగింది ? సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం.
గత కొన్ని ఏళ్లుగా ఉపయోగించకుండా వదిలేసిన ఓ ఆసుపత్రిలోకి సెక్యూరిటీ గార్డ్ తన మొదటి రాత్రి డ్యూటీ కోసం అడుగు పెడతాడు. బయటకు చూస్తే భవనం ఖాళీగా కనిపిస్తుంది. కానీ లోపల అడుగు పెట్టిన తర్వాత అక్కడి వాతావరణం మాత్రం అతడికి నెమ్మదిగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అతడి బాడీక్యామ్ లో మొత్తం డ్యూటీ రికార్డ్ అవుతుంటుంది. మొదట పెద్దగా ఏమీ కనిపించదు. ఖాళీ గదులు, చీకటి కారిడార్లు, పాత ఆసుపత్రి సామగ్రి మాత్రమే కనిపిస్తాయి. కానీ కొద్దిసేపటి తర్వాత అక్కడ ఏదో అసాధారణమైన విషయం జరుగుతోందనే అనుమానం కలుగుతుంది.
ఒక్కో చోట చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తాయి. ఎవరైనా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వెళ్లి చూస్తే ఎవరూ ఉండరు. గార్డ్ తనను తాను సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించినా, కెమెరాలో రికార్డవుతున్న కొన్ని దృశ్యాలు అతడి అనుమానాన్ని మరింత పెంచుతాయి. ఆ ఆసుపత్రిలో కేవలం దెయ్యాల భయం మాత్రమే కాదు… ఎవరో ఒకరు అక్కడ దాక్కుని ఉన్నారనే భావన కూడా కలుగుతుంది. అంటే అతడు ఎదుర్కొంటున్న ప్రమాదం అతీంద్రియమైనదా ? లేక మానవ రూపంలో ఉన్న ఓ ప్రమాదకరమైన వ్యక్తి అతడిని గమనిస్తున్నాడా ? అనే సందేహాల మధ్య కథ ముందుకు సాగుతుంది.
బాడీక్యామ్ ఫుటేజ్ నే కథ చెప్పే ప్రధాన సాధనంగా ఉపయోగించడంతో ప్రేక్షకుడికి కూడా గార్డ్ చూసినదే కనిపిస్తుంది. దాంతో ముందే ఏం జరగబోతోందో తెలియదు. కెమెరా ఎటు తిరుగుతుందో, చీకటిలో ఏం కనిపిస్తుందో అనే టెన్షన్ కొనసాగుతుంది. ఆ పాడుబడిన ఆసుపత్రిలో అసలు ఎవరు ఉన్నారు ? గార్డ్ ను ఎవరు గమనిస్తున్నారు ? కెమెరాలో కనిపించే వింత దృశ్యాల వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి ? అక్కడ గతంలో జరిగిన ఏదైనా సంఘటనకే ఈ భయానక పరిస్థితులకు సంబంధం ఉందా ? ఆ రాత్రి గార్డ్ కు ఏం జరిగింది ? చివరికి బయటపడే ఆ ఫుటేజ్ లో దాగి ఉన్న భయంకరమైన నిజం ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ హర్రర్ మూవీని చూడడం మరచిపోవద్దు.
నికోలస్ పినెడా (Nicholas Pineda) దర్శకత్వం వహించిన ‘ఇన్‌ఫర్మరీ’లో పాల్ సైర్, మార్క్ ఆంథోనీ విలియమ్స్, డేనియల్ కెన్నెడీ తదితరులు నటించారు. ఈ ఇంగ్లిష్ ఫౌండ్-ఫుటేజ్ హారర్ మూవీ అక్టోబర్ 2నుంచి షడర్ (Shudder)లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 1 గంట 25 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఇంగ్షీషులోనే ఉంది.
Read Also: జైలులో ఉన్న ఖైదీకి ఓ ఒంటరి తల్లి లేఖలు… కట్ చేస్తే మతిపోగొట్టే ట్విస్ట్… ఈ ఎమోషనల్ మూవీ తెలుగులోనే